Babar Azam Breaks : బాబర్ ఆజమ్ అరుదైన రికార్డ్
కోహ్లీ, ఆమ్లా రికార్డ్ బద్దలు
Babar Azam Breaks : ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు స్కిప్పర్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. తన వన్డే కెరీర్ లో 19వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీతో పాటు హషీమ్ ఆమ్లా ల ను దాటేశాడు.
Babar Azam Breaks Old Records
దాదాపు 15 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఆసియా కప్ ను హైబ్రిడ్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. కొన్ని మ్యాచ్ లను పాకిస్తాన్ లో మరికొన్ని మ్యాచ్ లను శ్రీలంకలో జరగనున్నాయి. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలిసారిగా నేపాల్ తో పాకిస్తాన్ తలపడింది.
తన జట్టు తరపున బాబర్ ఆజమ్(Babar Azam Breaks) అడ్డు గోడలా నిలిచాడు. భారీ స్కోర్ నమోదు చేశాడు. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్ లో బాబర్ ఆజమ్ విరాట్ కోహ్లీ , ఆమ్లా, డేవిడ్ వార్నర్ , ఏబీ డివిలియర్స్ లను అధిగమించాడు.
బాబర్ 102 ఇన్నింగ్స్ లలో 19 వన్డే సెంచరీలు నమోదు చేశాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. భారత ఆటగాడు కోహ్లీ 124 ఇన్నింగ్స్ లో 19వ సెంచరీ పూర్తి చేశాడు. వార్నర్ 139 ఇన్నింగ్స్ ల్లో 19 సెంచరీలు చేశాడు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 342 రన్స్ చేసింది. ఇందులో బాబర్ ఆజమ్ 151 పరుగులు చేశాడు.
Also Read : PM Modi : చిన్నారులతో మోదీ ముచ్చట