BCCI Saha : భారత క్రికెట్ ప్లేయర్ వృద్దిమాన్ సాహాను జర్నలిస్ట్ బెదిరింపులకు గురి చేసిన వ్యవహారం దేశ మంతా చర్చకు దారి తీసింది. దీంతో బీసీసీఐ(BCCI Saha) ఏకంగా దీనిని సీరియస్ గా తీసుకుంది.
ఇందుకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. జర్నలిస్ట్ నుంచి సాహాకు వచ్చిన బెదిరింపులపై ఈ కమిటీ పూర్తిగా విచారణ చేపడుతుందని తెలిపింది.
క్రికెటర్ వృద్దిమాన్ సాహాతో పాటు సదరు జర్నలిస్ట్ ఎవరనే దానిపై కమిటీ నివేదిక అందజేస్తుందని ప్రకటించింది. ఇక బీసీసీఐ ప్రకటించిన ముగ్గురు సభ్యుల కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ , బీసీసీఐ (BCCI Saha)అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభ తేజ్ సింగ్ భాటియా ఉన్నారు.
కమిటీ వచ్చే వారంలో విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నాడు వృద్దిమాన్ సాహా.
ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ సందర్భంగా అడిగే సందేశాలకు స్పందించనందుకు బెదిరింపులకు గురి చేశాడంటూ సాహా ఆరోపించాడు.
ఒకవేళ తాను బయట పెడితే బాగుండదంటూ హెచ్చరించాడంటూ వాపోయాడు. దీనిని సీరియస్ గా తీసుకుంది బీసీసీఐ. ఈ విషయాన్ని గ్రహించిన బీసీసీఐ అపెక్స్ బోర్డు సాహాతో సంప్రదింపులు జరిగిందని బీసీసీఐ తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాళ్ల వల్ల కెరీర్ దెబ్బ తింటుందని, అతడి పేరు చెప్పడం మంచిది కాదనే తాను బయటకు చెప్పలేదన్నాడు సాహా.
Also Read : బుమ్రా పర్ ఫార్మెన్స్ సూపర్