IPL BCCI : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ 15వ ఎడిషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ. ఇప్పటికే బెంగళూరు వేదికగా వేలం పాట పూర్తయింది.
దీంతో ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది బీసీసీఐ(IPL BCCI ). గతంలో కేవలం 8 ఫ్రాంచైజీలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి మరో రెండు ఫ్రాంచైజీలకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.
అహ్మదాబాద్, లక్నో జట్లు ఈసారి కొత్తగా ఐపీఎల్ టోర్నీలో పాల్గొననున్నాయి. ఇదిలా ఉండగా ఈనెల 8 నంచి ఐపీఎల్ లో పాల్గొనే ఆయా జట్లన్నీ ముంబైకి చేరుకోవచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది.
సహాయక సిబ్బంది, ఫ్రాంఛైజీల ప్రతినిధిలు, అందుబాటులో ఉన్న ప్లేయర్లంతా జట్లతో పాటు విచ్చేవచ్చంటూ స్పష్టం చేసింది బీసీసీఐ(IPL BCCI ). ఇదిలా ఉండగా మరో కీలక ఆదేశం జారీ చేసింది.
ఐపీఎల్ మెగా రిచ్ లీగ్ కు సంబంధించి అందుబాటులో ఉన్న ఆటగాళ్లంతా ఇండియాలో ఉన్న వారైతే మూడు రోజులు , విదేశాల నుంచి వచ్చే వారైతే తప్పనిసరిగా ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని స్పష్ం చేసింది బీసీసీఐ.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ నివేదికను తప్పనిసరి చేసింది. ముంబైకి రావడానికి రెండు రోజుల ముందు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కుండ బద్దలు కొట్టింది.
కాగా నెల 26 నుంచి ప్రాంరభం అయ్యే ఐపీఎల్ 2022 సీజన్ లో మొత్తం 70 మ్యాచ్ లు జరగనున్నాయి. 55 మ్యాచ్ లు ముంబైలో , 15 మ్యాచ్ లు ఎంసిఏ మైదానంలో జరుగుతాయి.
Also Read : సంజూ శాంసన్ పై రోహిత్ శర్మ కితాబు