Bharat Comment : పేరు మారిస్తే ‘భారత్’ బాగుపడుతుందా
ఇండియా ఇక నుంచి భారత దేశం
Bharat Comment : కొందరు ఇండియాను వద్దంటున్నారు. మరికొందరు భారత దేశం(Bharat) పేరు ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకొందరు హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లవుతోంది. ఆంగ్లేయులు పాలించిన నాటి నుంచి వాళ్లు దేశం విడిచి వెళ్లి పోయేంత వరకు ఇండియా వాడుకలోనే ఉంది. గెజిట్ నుంచి కింది స్థాయి వరకు అంతా ఇండియాను విరివిగా వాడడం వస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరారో ఆనాటి నుంచి దేశంలోని ప్రాంతాలు, పేర్లు, ప్రముఖులకు సంబంధించిన వారిని కూడా మారుస్తూ వచ్చారు.
Bharat Comment Viral
గాంధీ అన్న పేరు కనిపించే ప్రతి ఒక్క దానిని టార్గెట్ చేస్తూ పోయారు. హిందూ సంస్కృతి, నాగరికత, చరిత్రను ఏదో రూపంలో చొప్పించే ప్రయత్నం చేశారు. ఫండమెంటల్ భావాలు కలిగిన వ్యక్తిని తీసుకు వచ్చి ప్రతిష్టాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీకి వీసిని చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దేశంలో సవాలక్ష సమస్యలు నెలకొన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రచారం తప్ప పనులేమీ కావడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం మోదీ ప్రభుత్వం వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, బడా బాబుల కోసమే పని చస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ తరుణంలో వచ్చే ఏడాది 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి పవర్ లోకి రావాలని మోదీ పరివారం ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో మోదీని ఎదుర్కొనేందుకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు 28 పార్టీలు ఇండియా(India) కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇండియా లేదా భారత్(Bharat) అనే దానిపై చర్చ జరుగుతోంది. హాట్ టాపిక్ గా మారింది ప్రెసిడెంట్ పేరుతో విడుదల చేసిన ఇన్విటేషన్. భారత్ జి20కి నాయకత్వం వహిస్తోంది. జి20 డిన్నర్ కు ప్రపంచంలోని దేశాలకు ఆహ్వానం పంపింది. ఇందులో పేర్కొన్న విధానం మరింత చర్చకు దారితీసేలా చేసింది.
గతంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఇన్విటేషన్ ఉండేది. కానీ ప్రస్తుతం పంపించిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా అంతా ఇండియా కాదు భారత్ అని పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం తమ కూటమిని తట్టుకోలేక మోదీ భారత్ అని మార్చేశారంటూ పేర్కొన్నాయి. మొత్తంగా పేరు మార్చినంత మాత్రాన భారత్ తన దిశను, దశను మార్చుకుంటుందా లేక భవిష్యత్తు ఏమైనా మారుతుందా అన్నది వేచి చూడాలి.
Also Read : Anil Kumar Yadav : అమరావతి బూటకం అవినీతిమయం