Brahmanandam Rangamarthanda : బ్రహ్మానందం విశ్వరూపం
రంగమార్తాండపై భారీ అంచనాలు
Brahmanandam Rangamarthanda : తెలుగు సినీ వినీలాకాశంలో అద్భుతమైన నటుడిగా గుర్తింపు పొందారు బ్రహ్మానందం. ఆయన పేరు చెబితే చాలు నవ్వు పెదవులపై పూస్తుంది. ఈ కన్నెగంటి బ్రహ్మానంద చారి ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తర్వాత కష్టపడి చదువుకున్నారు. పిల్లలకు పాఠాలు బోధించేందుకు లెక్చరర్ అయ్యారు. స్వతహాగా సాహిత్యం మీద మంచి పట్టున్న వ్యక్తి. దివంగత దర్శకుడు జంధ్యాల పుణ్యమా అని బ్రహ్మానందం సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. హాస్య నటులలో టాప్ లో నిలిచాడు. కమెడియన్ గా, హీరోగా కూడా నటించారు బ్రహ్మానందం(Brahmanandam Rangamarthanda). వందలాది సినిమాలు ఆయన వల్ల నడిచాయి. హాస్యాన్ని పండించడం లోనే కాదు కన్నీళ్లను పెట్టించడంలో కూడా సిద్దహస్తుడు. బ్రహ్మానందంలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తాజాగా తను మనసు పెట్టి తీసిన రంగమార్తాండలో. ఉగాది సందర్భంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల చేసిన టీజర్ కు భారీ ఆదరణ ఇప్పటికే లభించింది. తాజాగా రంగ మార్తాండకు సంబంధించి చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో మరో దిగ్గజ , విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ పడి నటించాడు. ఓ వైపు బ్రహ్మానందం మరో వైపు ప్రకాశ్ రాజ్ నువ్వా నేనా అనే రీతిలో నటించి కంటతడి పెట్టించారు. ఏది ఏమైనా బ్రహ్మానందం మరోసారి తన పాత్రకు న్యాయం చేశాడు. తలుచుకునేలా చేశాడు.
Also Read : రంగమార్తాండ ట్రైలర్ వైరల్