C. P. Radhakrishnan: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు !
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు !
C. P. Radhakrishnan: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్(C. P. Radhakrishnan) కు… తెలంగాణాలతో పాటు పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. తమిళిసై రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. దీనితో ఆమె స్థానంలో సీపీ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్ను నియమించే వరకూ రాధాకృష్ణనే గవర్నర్గా కొనసాగనున్నారు.
C. P. Radhakrishnan As a Telangana Governer
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘‘ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
Also Read : Patanjali : పతంజలి అధినేత రామ్ దేవ్ బాబా పై సుప్రీం కోర్టు సమన్లు జారీ