YSRCP MLA Arthur: వైసీపీకి షాక్ ! కాంగ్రెస్‌ లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ !

వైసీపీకి షాక్ ! కాంగ్రెస్‌ లో చేరిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ !

YSRCP MLA Arthur: ఆంధ్రప్రదేశ్‌ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్(YSRCP MLA Arthur) ఈ పార్టీని వీడారు. వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్థర్‌ కు షర్మిల కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ధర్… గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా ఆర్ధర్ ను కాదని… అతని స్థానంలో ధార సుధీర్ కు సీటు ప్రకటించారు. దీనితో ఆర్ధర్ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీలో చేరుతారా లేక కాంగ్రెస్ లో చేరుతారా అనే దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఆయన కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది.

YSRCP MLA Arthur – ఈ నెల 25న కాంగ్రెస్‌ జాబితా ! కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల ?

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్ఠానం… ఈ నెల 25న జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల… కడప లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read : C. P. Radhakrishnan: తెలంగాణ గవర్నర్‌ గా సీపీ రాధాకృష్ణన్‌ కు అదనపు బాధ్యతలు !

Leave A Reply

Your Email Id will not be published!