Canada Expells : భారత దౌత్యవేత్త బహిష్కరణ – కెనడా
ప్రకటించిన దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో
Canada Expells : కెనడా – భారత దేశ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత్ హత మార్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో. దీంతో తమ దేశంలో ఉన్న భారత దేశ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన చేసిన ప్రకటన కలకలం రేపింది. దీనిపై భారత దేశం ఇంకా స్పందించ లేదు.
Canada Expells Viral
ఇదిలా ఉండగా ఒంటారియో ఒట్టావా లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో పీఎం ప్రకటన చేశారు. టెర్రరిస్టు మరణం వెనుక భారత్ ఉందన్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు పీఎం ట్రూడో(Justin Trudeau). గత వారం ఇండియా లోని ఢిల్లీలో జరిగిన జి20 సదస్సులో సైతం తాను ప్రధానమంత్రి మోదీకి ఈ విషయం తెలియ చేసినట్లు చెప్పారు పీఎం.
భారత సర్కార్ ప్రమేయం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదంటూ కూడా తాను స్పష్టం చేశానన్నారు. కెనడా, భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో వాణిజ్య మిషన్ ను రద్దు చేసింది. కెనడాలో సిక్కు జనాభా 7,70,000 గా ఉంది. ఆ దేశ జనాభాలో రెండు శాతం.
అయితే ఖలిస్తాన్ ఉద్యమాన్ని భారత దేశం నిషేధించింది. కాగా ఈ ఉద్యమానికి కెనడా, అమెరికా తదితర దేశాలలో మద్దతు లభిస్తోంది. అక్కడ ఖలిస్తాన్ ఉద్యమంపై నిషేధం లేదు. దీంతో ప్రతి సారి భారత్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
Also Read : AP CM YS Jagan Reddy : టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు