Dolo 650 : అడ్డగోలు లంచం ‘డోలో’ నిర్వాకం
దర్యాప్తు జరపాలంటూ కేంద్రం ఆదేశం
Dolo 650 : ఈ దేశంలో మెడికల్ మాఫియా పేట్రేగి పోతోంది. అడ్రస్ లేని కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఆపై ఫార్మా కంపెనీలకు కరోనా పుణ్యమా అని పంట పండింది.
వందల కోట్ల నుంచి వేల కోట్లు అడ్డదిడ్డంగా సంపాదించాయి. ఇక వ్యాక్సిన్ల తయారీ సంస్థలకు అక్షయపాత్రగా మారింది కరోనా మహమ్మారి.
ఇది పక్కన పెడితే ఇదే మహమ్మారి దెబ్బకు దేశంలోని బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ సంస్థ పెద్ద ఎత్తున లాభం చేకూరింది. వేల కోట్లు వెనకేసుకుంది.
ఈ కంపెనీ తయారు చేసిన ఒకే ఒక్క టాబ్లెట్. అదే 133 కోట్ల భారతీయులందరికీ సుపరిచితమైన పేరు డోలో -650(Dolo 650) టాబ్లెట్స్. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తాయి.
కానీ మైక్రో ల్యాబ్స్ కంపెనీ అనైతిక కార్యకలాపాలకు దిగిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక దాడులు చేపట్టంది ఆదాయపన్ను శాఖ.
పెద్ద ఎత్తున లెక్కలు చూపించకుండా ఇతర మార్గాలలో పెట్టుబడిగా పెట్టారని తేల్చింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక విస్తు పోయే అంశాలు వెలుగు చూశాయి.
అదేమిటంటే తాము తయారు చేసే మందుల్ని కొనుగోలు చేసేలా సదరు కంపెనీ ఏకంగా దేశంలోని డాక్లర్లకు వివిధ రూపేణా ఏకంగా రూ. 1,000 కోట్ల దాకా బహమతులు, నజరానాల రూపంలో ముట్ట చెప్పినట్లు గుర్తించింది.
దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయా డాక్లర్లకు నోటీసులు కూడా జారీ చేయాలని సూచించింది.
Also Read : ఐఐటీ మద్రాస్ కు ప్రపంచ గుర్తింపు