Dhanasri Chahal : చాహల్ నువ్వో అద్భుతం – ధనశ్రీ
టి20 ఫార్మాట్ లో టాప్ బౌలర్
Dhanasri Chahal : తన అద్భుతమైన బంతులతో ప్రత్యర్థుల వికెట్లను పడగొట్టే నైపుణ్యం కలిగిన బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఇవాళ జూలై 23 అతడి పుట్టిన రోజు. శనివారంతో చాహల్ కు 32 ఏళ్లు. సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా చాహల్ చిన్న పిల్లాడి మనస్తత్వం. అతడికి భార్య ధనశ్రీ (Dhanasri Chahal) అంటే వల్లమాలిన అభిమానం. తను ఎక్కడున్నా ఆమెతో టచ్ లో ఉంటాడు. ఈ సందర్భంగా జీవితమనే ప్రయాణంలో ఎన్నెన్నో అందమైన మలుపులు ఉన్నాయి.
నువ్వు అత్యంత మంచి వాడివి అంటూ పేర్కొంది ధనశ్రీ. ఆ దైవం నిన్ను చల్లంగా చూడాలి చాహల్. నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను నీకు వీరాభిమానినంటూ బెస్ట్ విషెస్ తెలిపింది.
ఇదిలా ఉండగా ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేకంగా కంగ్రాట్స్ పేర్కొంది. 127 అంతర్జాతీయ మ్యాచ్ లు. 192 వికెట్లు. టి20 మ్యాచ్ లలో వేగవంతంగా 50 వికెట్లు అందుకున్న ఏకైక బౌలర్ అని ప్రశ్నించింది.
ఒకే మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ అంటూ కితాబు ఇచ్చింది. ఈ మేరకు యుజ్వేంద్ర చాహల్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించింది బీసీసీఐ.
చహల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సంజూ శాంసన్ , జోస్ బట్లర్ , దినేశ్ కార్తీక్ , కుల్దీప్ యాదవ్ , నవదీప్ సైనీ, రాబిన్ ఊతప్ప, ఆర్బీ సింగ్ , రాహుల్ ద్రవిడ్ , హార్దిక్ పాండ్యా, తదితరులు బెస్ట్ విషెస్ అందించారు.
Also Read : దిగ్గజాల కలయిక జ్ఞాపకాల కలబోత