KL Rahul Chat GPT : కేఎల్ రాహుల్ పై చాట్ జిపిటి కామెంట్
ఏఐ ఆధారిత సాంకేతిక ప్లాట్ ఫారమ్ తీర్పు
KL Rahul Chat GPT : ప్రముఖ ఐటీ సెర్చింగ్ ఇంజిన్ చాట్ జీపీటి ఏఐ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో తీవ్రమైన ఫామ్ లేమితో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు కేఎల్ రాహుల్.
ఇప్పటికే భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్రంగా తప్పు పట్టాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీలోనే ఏదో లోపం ఉందన్నాడు. అంతే కాదు ఫెవరిటిజం ఎక్కువగా పనిచేస్తోందని, ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్ కు సారథిగా ఉండడం అతడి ఎంపికకు మార్గం చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ తరుణంలో చాట్ జీపిటి కేఎల్ రాహుల్ ను(KL Rahul Chat GPT) ఉంచాలా వద్దా అని అడిగితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఆకాష్ చోప్రా కూడా కామెంట్ చేయడం కలకలం రేపింది. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ లు స్వంత అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
రాహుల్ ను కంటిన్యూ చేయాలా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి చాట్ జిపిటి ఏఐ ఆసక్తికర సమాధానం ఇచ్చింది కేఎల్ రాహుల్ పై.
నిర్దిష్ట వ్యక్తులు లేదా టీమ్ ల గురించి తనకు వ్యక్తిగత అభిప్రాయాలు లేదా పక్షపాతాలు లేవని పేర్కొంది. ఒక సాధారణ నియమం ప్రకారం జట్టు నుండి ఆటగాడిని తొలగించాలనే నిర్ణయం వారటి ఇటీవల పనితీరు, ఫిట్ నెస్ ఆధారంగా ఉండాలని పేర్కొంది. ఒకవేళ రాహుల్ పనితీరు సాధారణంగా ఉన్నట్లయితే మరో ఆటగాడిని ఎంపిక చేయడంలో తప్పు లేదని స్పష్టం చేసింది.
Also Read : ఇంగ్లండ్ సెన్సేషన్ పాక్ పరేషాన్