చెన్నై ఆశ‌లు గ‌ల్లంతు ద‌ర్జాగా హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ కు

5 వికెట్ల తేడాతో అద్భుత విజ‌యం సాధించిన రైజ‌ర్స్

చెన్నై : చెపాక్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగింది. సీఎస్కే ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. దీంతో ఇంటి బాట ప‌ట్టేందుకు రెడీ అయ్యింది సీఎస్కే. మ‌రోసారి సంజు శాంస‌న్ ఫెయిల్ అయ్యాడు. అడ్డ‌మైన షాట్ కొట్టి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. త‌న‌ను రూ. 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది మేనేజ్మెంట్. ఇక చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌ధానంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ అద్బుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. కీల‌క‌మైన వికెట్ల‌ను కూల్చాడు.

ఫుల్ ఫామ్ మీదున్న శాంస‌న్ ను తెలివైన బంతికి బోల్తా కొట్టించాడు. ప్ర‌తి ఓవ‌ర్ కు ఒక‌రిని ఔట్ చేశాడు. త‌ను 4 ఓవ‌ర్ల‌లో 29 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు ఇషాన్ కిష‌న్ రెచ్చి పోయాడు. 47 బంతులు ఆడి 7 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో దంచికొట్టాడు. 70 ప‌రుగులు చేశాడు. దీంతో 5 వికెట్ల తేడాతో ఓడి పోయింది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడిన ఎస్ ఆర్ హెచ్ 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇప్ప‌టికే ఆర్సీబీ, గుజ‌రాత్ టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్నాయి.

అంత‌కు ముందు సీఎస్కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల లక్ష్యం నిర్దేశించింది. ఈ టార్గెట్ ను 19 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. కిష‌న్ తో పాటు క్లాసెన్ 26 బంతులు ఆడి 6 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 47 ర‌న్స్ చేశాడు. ఇక సీఎస్కే జ‌ట్టులో బ్రెవిస్ 27 బంతులు ఆడి 2 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్స చేస్తే కార్తీక్ శ‌ర్మ 19 బంతులు ఆడి 3 పోర్లు 2 సిక్స‌ర్ల‌తో 32 ప‌రుగులు చేశారు. ఇషాన్ కిష‌న్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు ద‌క్కింది.

Leave A Reply

Your Email Id will not be published!