Claudine Gay : హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ చీఫ్ గా క్లాడిన్ గే

మొద‌టి న‌ల్ల జాతీయురాలికి అప్ప‌గింత

Claudine Gay : అమెరికా దేశ చ‌రిత్ర‌లో నూత‌న అధ్యాయానికి శ్రీ‌కారం చుట్టుంది హార్వర్డ్ యూనివర్శిటీ. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన విశ్వ విద్యాల‌యంగా పేరొందింది. ఇక ఆ దేశం ఎంత‌గా అభివృద్ది చెందినా అక్క‌డ బ్లాక్ అండ్ వైట్ వైరం కొన‌సాగుతోంది. ఒక క‌రంగా జాతి వివ‌క్ష కీల‌కంగా మారింది. దాడులు, కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి.

ఈ త‌రుణంలో బ‌రాక్ ఒబామా న‌ల్ల జాతీయుడే ఆ దేశానికి ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యారు గ‌తంలో. తాజాగా జోసెఫ్ బైడెన్ వ‌చ్చాక కీల‌క పోస్టుల‌లో న‌ల్ల వారిని నియ‌మిస్తూ వ‌స్తున్నారు. తాజాగా హార్వ‌ర్డ్ విశ్వ విద్యాల‌యంకు తొలిసారిగా న‌ల్ల జాతీయురాలైన క్లాడిన్ గేను(Claudine Gay)  అధ్య‌క్షురాలిగా నియ‌మించింది ప్ర‌భుత్వం.

హైతీ వ‌ల‌స‌దారుల కూతురు ఆమె. వ‌చ్చే ఏడాది 2023 జూలై 1న యూనివ‌ర్శిటీ 30వ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టున్న‌ట్లు హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ పాల‌క వ‌ర్గం వెల్లడించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు విశ్వ విద్యాల‌యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫ్యాక‌ల్టీ డీన్ గా ఉన్నారు క్లాడిన్ గే.

ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్శిటీలో ఈ ప‌ద‌విని నిర్వ‌హించిన మొద‌టి ఆఫ్రిక‌న్ అమెరిక‌న్. ఆమెకు 53 ఏళ్లు. మ‌సాచుసెట్స్ లోని కేంబ్రిడ్జిలోని పాఠ‌శాల‌కు చీఫ్ గా ఎన్నికైన రెండో మ‌హిళ(Claudin Gay)  కావ‌డం విశేషం.

హార్వ‌ర్డ్ అక‌డమిక్ ఎక్స‌లెన్స్ ను నిల‌బెట్టేందుకు , మెరుగు ప‌ర్చేందుకు అంకిత భావంతో ఉన్న క్లాడిన్ గొప్ప నాయ‌కురాలుగా అభివృర్ణించారు హార్వ‌ర్డ్ ప్రెసిడెన్షియ‌ల్ సెర్చ్ క‌మిటీ చైర్మ‌న్ పెన్నీ ప్రిట్జ్ క‌ర్.

Also Read : యోగా..ప‌ర్యావ‌ర‌ణానికి ప్ర‌యారిటీ

Leave A Reply

Your Email Id will not be published!