CM KCR Comment : కేసీఆర్ సైలెన్స్ డేంజ‌రస్

పులి మౌనంగా ఉంద‌నుకుంటే ఎలా..?

CM KCR Comment : ఆ మ‌ధ్య‌న అర‌వింద స‌మేత సినిమా వ‌చ్చింది. హీరో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అద్భుత‌మైన డైలాగులు రాశాడు. అదుగో వ‌స్తున్నాడు చూడు బాల్ రెడ్డి. యుగానికి ఒక్క‌డు..వాడు టార్చ్ బేర‌ర్ అని రావు ర‌మేష్ తో అనిపిస్తాడు. సేమ్ సీన్ తెలంగాణ రాజ‌కీయాల‌లో స‌రిగ్గా స‌రిపోతుంది ఒకే ఒక్క‌డు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కు. ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఆలోచించ‌డం, ఊహించ‌ని రీతిలో షాక్ ఇవ్వ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఉద్య‌మ నేత‌గా పేరు పొందాడు. రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాడు. దీంతో దేశంలోనే పొలిటిక‌ల్ హీరోగా మారి పోయాడు కేసీఆర్. ప్ర‌త్య‌ర్థుల‌ను బురిడీ కొట్టించ‌డంలో, త‌న‌కు శ‌త్రు శేషం లేకుండా చేసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు కేసీఆర్.

CM KCR Comment Viral

ఆయ‌న స్వ‌యంగా క‌వి, ర‌చ‌యిత‌, గాయ‌కుడు, ఉద్య‌మ‌కారుడు, ప్ర‌కృతి ప్రేమికుడు, బ‌హు భాషా కోవిదుడు. అన‌ర్ఘ‌లంగా ఏ అంశంపైన నైనా గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌సంగించే ఏకైక నాయకుడు కేసీఆర్(CM KCR). ఇంకా చెప్పాలంటే త‌ల‌పండిన మేధావులు, క‌ళాకారులు, వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌లు సైతం విస్తు పోయేలా చేయ‌డంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ స్పీక‌ర్ దిట్ట‌. ఎవ‌రైనా , ఎంత‌టి వారైనా స‌రే త‌న‌కు త‌ల వంచాల్సిందే. మాట‌ల తూటాలు పేల్చ‌డంలో అంద‌రికంటే ముందుంటారు. ఎవ‌రినైనా తిట్టాల‌న్నా అరుదైన భాష‌ను వాడుతూ మెస్మ‌రైజ్ చేయ‌డంలో కూడా ఫ‌స్ట్ కేసీఆర్. ఇక త‌ల‌పండిన మేధావులు, ఆలోచ‌నాప‌రులు, సీనియ‌ర్ మీడియా ప్ర‌తినిధులు సైతం సీఎంకు కున్న ప‌రిజ్ఞానాన్ని చూసి విస్తు పోవాల్సిందే. ఒక ర‌కంగా చెప్పాలంటే మెస్మ‌రైజ్ కావాల్సిందే.

కార‌ణం ఆయ‌న‌కు తెలంగాణ‌లో ప్ర‌తి అడుగు అడుగు తెలుసు. ఏ ప్రాంతం దేనికి ప్ర‌సిద్ది చెందిందో..ఎక్క‌డెక్క‌డ ఏమేం ఉన్నాయో, ఎన్ని వ‌న‌రులు ఎలా వినియోగించు కోవ‌చ్చో ఘంటా ప‌థంగా చెప్పుకుంటూ పోతారు. వ్యూహాలు ప‌న్న‌డంలో అంద‌రికంటే ముందంజ‌లో ఉండే కేసీఆర్ ఇప్పుడు మౌనాన్ని ఆశ్ర‌యించారు. వ‌య‌సు మీద ప‌డినా ఇంకా త‌ను నిత్యం చైత‌న్య‌వంతంగా ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలుసుకుంటూ..ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అయ్యే కేసీఆర్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌డాన‌కి వీలులేదు. కార‌ణం ఆయ‌న మౌనంగా ఉన్నారంటే ఏదో ఆలోచిస్తున్నార‌ని అర్థం. అందుకేనేమో త‌న‌యుడు కేటీఆర్ ఈ మ‌ధ్య‌నే ఓ మాట అన్నారు. పులి నిద్ర పోతుంద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే.. త్వ‌ర‌లోనే జూలు విద‌ల్చ‌డం ఖాయం..ఇక మిగ‌తా జంతువుల‌న్నీ పారి పోవాల్సిందే..లేదా దాచుకోవాల్సిందేన‌ని. మ‌రి ఆ పులి ఎవ‌ర‌ని అనుకుంటున్నారు..ఒకే ఒక్క‌డు సీఎం కేసీఆర్. ఆయ‌న రాజ‌కీయ అనుభ‌వానికి తాజాగా జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు అగ్ని ప‌రీక్ష లాంటిది. మ‌రి ఏం చేస్తారో వేచి చూడాలి.

Also Read : Amartya Sen : అమ‌ర్త్య సేన్ ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!