CM Revanth Reddy: ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు – తెలంగాణ సీఎం రేవంత్

ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు - తెలంగాణ సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు. దీనిలో బాగంగా అతి త్వరలోనే పోలీసు శాకలో 15వేల ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం తన కుటుంబ సభ్యుల ఉద్యోగాలపై మాత్రమే దృష్టి పెట్టిందని… రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలను కవితను ఎంపీగా ఓడిస్తే… వెంటనే ఆమెను ఎమ్మెల్సీను చేసి కేసీఆర్ ఉద్యోగం కల్పించారన్నారు.

కాని నిధులు, నియామకాల కోసం తెలంగాణా ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన నిరుద్యోగ యువతను కేసీఆర్ గాలికి వదిలేసారని ఎద్దేవా చేసారు. అయితే ప్రతీ తెలంగాణా బిడ్డకు ఉద్యోగం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్‌ నర్సులకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి అప్పాయింట్ మెంట్ ఆర్డర్స్ ను అందజేశారు.

CM Revanth Reddy Comment

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘‘లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర కల సాకారం కోసం కృషి చేశారు. ఈ పోరాటంలో వందల మంది అమరులయ్యారు. ఉద్యోగాలు అడిగిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. గత పదేళ్లలో వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని… కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమించామని త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. రాష్ట్రంలో 6,956 మంది స్టాఫ్‌నర్సులకు నియామకపత్రాలు ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక స్టాఫ్‌ నర్సులను అవమానించేలా మాట్లాడుతున్నారు. అటువంటి వారికి ప్రతిపక్షంలో కూడా ఉండే అర్హతలేదు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో స్టాఫ్‌ నర్సుల పాత్ర కీలకం. నిరుద్యోగుల కలలు సాకారం చేయడంలో ఇది తొలి అడుగని సీఎం రేవంత్ తెలిపారు.

ఎల్బీ స్టేడియంలోనే ఎందుకంటే ?

ఎల్బీ స్టేడియంలో గత ఏడాది డిసెంబరు 7న తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు వీలుగా కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం తరఫున మేం ప్రమాణస్వీకారం చేశాం. మా కుటుంబ సభ్యులు ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్‌నర్సుల కుటుంబాల్లో అలాంటి ఆనందం చూడాలనే ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలు అందజేస్తున్నాం. ఆ సంతోషంలో మేము కూడా పాలుపంచుకునేందుకే వచ్చాం. యువత కళ్లల్లో వెలుగులు చూడాలన్నది నా లక్ష్యం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 18 మందికి నియామక పత్రాలను సీఎం స్వయంగా అందజేయగా మిగిలినవారికి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, శాసన సభాపతి ప్రసాద్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read : Hemant Soren Arrested: జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ! కొత్త సీఎంగా చంపయీ సోరెన్‌ !

Leave A Reply

Your Email Id will not be published!