CM Revanth Reddy : పారిశ్రామిక అభివృద్దిపై ఫోకస్
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. మంగళవారం సచివాలయంలో హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీవీలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎంను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా హాజరయ్యారు.
CM Revanth Reddy Focus
పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు సీఎం. తమ సర్కార్ పెట్టుబడిదారులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎవరైనా తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు వస్తే తాము సహాయ సహకారాలు అందేస్తామన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితిపై వివరించారు. ఇండస్ట్రీస్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ పరంగా నూతన పారిశ్రామిక పాలసీని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
Also Read : KA Paul : నాతో వస్తే సీఎం చేస్తా – పాల్