PM Modi Nagaland : ఈశాన్య ప్రాంతాన్ని ఏటీఎంగా వాడారు
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి ఫైర్
PM Modi Nagaland : కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రాంతాన్ని ఏటీఎం (ఎనీ టైం మెషీన్ ) గా వాడుకుందని ఆరోపించారు. కానీ దానిని మేం పవర్ లోకి వచ్చాక తుడిచి వేశామన్నారు. పూర్తిగా నాగా లాండ్ ను అష్టలక్ష్మిగా మార్చేశామన్నారు మోదీ. కాగా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేసిందని పేర్కొన్నారు. నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు నరేంద్ర మోదీ(PM Modi Nagaland).
ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నాగాలాండ్ లో శాశ్వతమైన శాంతి నెలకొల్పేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. దీని ద్వారా సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని పూర్తిగా ఎత్తి వేస్తామని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్మి గా మార్చేశామన్నారు.
భారత దేశంలో అష్టలక్ష్మి దేవిని ఎనిమిది రూపాలుగా పరిగణిస్తారని తాము కూడా అలాగే కృషి చేశామని చెప్పారు ప్రధానమంత్రి. గతంలో ఏలిన వారు ప్రజలను విశ్వాసం లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఇదే సమయంలో విభజన రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. కానీ ఎలాంటి మేలు జరగలేదని ధ్వజమెత్తారు ప్రధానమంత్రి. ప్రస్తుతం తాము పవర్ లోకి వచ్చాక ఈ ఎనిమిది ప్రాంతాలను దైవిక పాలనకు దర్పణంగా మార్చేశామని చెప్పారు నరేంద్ర మోదీ.
కాంగ్రెస్ హయాంలో నాగాలాండ్(PM Modi Nagaland) లో రాజకీయ అస్థిరత ఉండేదన్నారు. ఢిల్లీ నుండి ఈశాన్య ప్రాంతాన్ని రిమోట్ గా ఉపయోగించిందన్నారు మోదీ.
Also Read : ప్రధానికి సురేంద్రన్ అరుదైన గిఫ్ట్