Roopa VS Sindhuri : రూపకు షాక్ సింధూరికి ఊరట
అసత్య కామెంట్స్ వద్దంటూ వార్నింగ్
Roopa VS Sindhuri : కన్నడ నాట ఇద్దరు ఉన్నతాధికారుల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వారిద్దరూ కీలక స్థానాలలో ఉన్న వారే. ఒకరు రూప మౌద్గిల్ కాగా మరొకరు రోహిణి సింధూరి. తన ప్రైవేట్ ఫోటోలను కావాలని రూప ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిందంటూ ఆరోపించింది. అంతే కాదు తనపై నిరాధారమైన 19 అభియోగాలు మోపిందంటూ వాపోయింది. ఇందుకు సంబంధించి రూ. 1 కోటి చెల్లించాలంటూ పరువు నష్టం దావా దాఖలు చేసింది. ఇదే సమయంలో కోర్టును ఆశ్రయించిన సింధూరికి(Roopa VS Sindhuri) ధర్మాసనం ఊరటనిచ్చింది.
ఇదే సమయంలో రూప తన నోరును అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేసింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా ఇద్దరు ఉన్నతాధికారులకు బిగ్ షాక్ ఇచ్చింది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరినీ తమ తమ పదవుల నుంచి తప్పించింది. కానీ ఈ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. వారిని బదిలీ చేయకంటే ముందు రూప రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ కు ఎండీగా ఉండగా రోహిణి సింధూరి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నారు.
ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. రోహిణికి ఇబ్బంది పెట్టేలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దంటూ రూపను ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇక నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేసినా తీవ్ర చర్యలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.
Also Read : ఈశాన్య ప్రాంతాన్ని ఏటీఎంగా వాడారు