అన్నాడీఎంకే కేబినెట్ లో చేరితే మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ

టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కు బిగ్ షాక్

చెన్నై : త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇప్ప‌టికే మాజీ సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య్ ఎక్కువ కాలం సీఎంగా ఉండ‌డ‌ని, టీవీకే ప్ర‌భుత్వం ప‌డి పోతుంద‌ని, తిరిగి ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. ఈ త‌రుణంలో వామ‌ప‌క్షాలు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అన్నాడీఎంకే పార్టీ అభ్య‌ర్థుల‌కు గ‌నుక మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తే తాము బేష‌ర‌తుగా త‌ప్పుకుంటామ‌ని, మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రిస్తామ‌ని వామ‌పక్ష పార్టీలు వార్నింగ్ ఇచ్చారు సీఎం జోసెఫ్ విజ‌య్ కి. తమిళనాడు మంత్రివర్గంలో విదుతలై చిరుతైగల్ కచ్చి చేరే అవకాశంపై స్పందిస్తూ, వామపక్ష పార్టీలు, వీసీకే కలిసి ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇవ్వాలని నిర్ణయించు కున్నాయని షణ్ముగం తెలిపారు.

అయితే వీసీకే తన సొంత రాజకీయ వైఖరిని తీసుకునే స్వేచ్ఛ దానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, అన్నాడీఎంకే నాయ‌కులు క‌లిసి పాల్గొన్నారు. కాగా తాము ఇస్తున్న మద్దతును పునః పరిశీలిస్తామని తమిళనాడు సీపీఎం కార్యదర్శి పి. షణ్ముగం బుధవారం మరోసారి స్పష్టం చేశారు. అన్నాడీఎంకే తమిళనాడు మంత్రివర్గంలో చేరితే ఒప్పుకునేది లేద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మా నిర్ణయాన్ని పునః పరిశీలిస్తామని తాము ఇప్పటికే స్పష్టం చేశామన్నారు. ఆ వైఖరిలో ఎటువంటి మార్పూ లేదన్నారు. ఒకవేళ వీసీకేకి ఏదైనా అవకాశం లభించిందని భావించి, దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, అందులో ఎటువంటి తప్పు లేదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!