హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. బుధవారం ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. బండి నేరుగా పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్బంగా తన గురించి ట్రోల్స్ జరుగుతున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
బీజేపీ పై ప్రేమ ఉన్న వ్యక్తిననని అన్నారు. తన చివరి శ్వాస విడిచాక భౌతిక దేహంపై బీజేపీ జెండా కప్పాలనే చివరి కోరిక ఉన్న ఎంతో మంది అభిమానుల్లో నేను ఒకడినని చెప్పారు. కొత్త పార్టీ అనే చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆలోచనలు ఉండవన్నారు.
కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన ఏకైక నాయకుడిని నేను అని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. కేసీఆర్ కొడుకులా ఫేక్ మీడియాలు నడిపి దుష్ప్రచారం చేసేవాళ్ళం కాదన్నారు. వాళ్ళ గడి గోడలు బద్దలు కొట్టాం అన్నారు. ఫ్రస్టేషన్ తో ఏదో ఏదో చేస్తుంటారు.. అవన్నీ పట్టించుకోమన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. నన్ను అరెస్ట్ చేస్తారనే విషయంపై మాట్లాడను.. కోర్టు లో అన్ని తేలుతాయి.. విచారణలో ఉందన్నారు. కుమారుడి వివాదం తర్వాత తొలిసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అది తప్పా ఆయన అన్నీ మాట్లాడుతుండడం విశేషం.