CSK vs SRH IPL 2023 : చెన్నై హైద‌రాబాద్ నువ్వా నేనా

జోరు మీదున్న సీఎస్కే ఎస్ ఆర్ హ‌చ్ స‌త్తా చాటేనా

CSK vs SRH IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా శుక్ర‌వారం కీల‌క మ్యాచ్ కు వేదిక కానుంది చెన్నై. ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈ కీల‌క లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ లో ఇది 29వ మ్యాచ్. ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK vs SRH IPL 2023)  బెంగ‌ళూరులోని చిన్న స్వామి స్టేడియంలో భారీ స్కోర్ సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 227 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది.

కానీ చివ‌ర‌కు ఆర్సీబీని 218 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. 8 ప‌రుగుల తేడాతో ఓడించింది. చెన్నై కి చెందిన ఓపెన‌ర్ డేవిన్ కాన్వే దంచి కొట్టాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన శివ‌మ్ దూబే శివ‌మెత్తాడు. ఆర్సీబీ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు.

ఇక హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ టీం చేతిలో హైద‌రాబాద్ ఓడి పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 192 ర‌న్స్ చేసింది. ఆతిథ్య జ‌ట్టు 178 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై పోయింది. 14 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది.

దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎలాగైనా స‌రే గెలుపొందాల‌ని ఉవ్విళ్లూరుతోంది. మ‌రో వైపు ఆర్సీబీని ఓడించి మంచి జోష్ మీదుంది చెన్నై సూప‌ర్ కింగ్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు జ‌ట్ల మ‌ధ్య 18 మ్యాచ్ లు జరిగాయి. చెన్నై 13 సార్లు గెలిస్తే హైద‌రాబాద్ 5 సార్లు మాత్ర‌మే విజ‌యం సాధించింది.

Also Read : కింగ్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త

Leave A Reply

Your Email Id will not be published!