Dasoju Sravan Satyanarayana : దాసోజు..కుర్రాకు బంపర్ ఆఫర్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమోట్
Dasoju Sravan Satyanarayana : సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరిని నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించారు. మూకుమ్మడిగా తీర్మానం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్(BRS) అగ్ర నేతగా కొనసాగుతున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ , మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తున్నట్లు తెలిపారు.
Dasoju Sravan Satyanarayana Promoted
ప్రస్తుతం ఇదే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న ఫారుక్ హుస్సేన్ , రాజేశ్వర్ రావు పదవీ కాలం ముగిసింది. దీంతో వీరి స్థానంలో దాసోజు, కుర్రాలకు ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్. కాగా దాసోజు శ్రవణ్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా. ఆయన విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక కుర్రా సత్యనారాయణ సంగారెడ్డి ప్రాంతానికి చెందిన వారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. పెరికె సామాజిక వర్గానికి చెందిన వారు.
1999లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 దాకా బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఇక దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మెగా స్టార్ స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉన్నట్టుండి రేవంత్ తో పడక బీజేపీలో చేరారు. ఎందుకనో వెంటనే తిరిగి పాత గూడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చివరికి ఎమ్మెల్సీ దక్కించుకున్నారు.
Also Read : TTD EO Dharma Reddy : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు