Dasoju Sravan Kumar : బ‌ల‌మైన గొంతుక ‘దాసోజు’

గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఎమ్మెల్సీ

Dasoju Sravan Kumar : ఎట్ట‌కేల‌కు తెలంగాణలో బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ వ‌చ్చిన డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌కు 56 ఏళ్లు. స్వ‌స్థలం న‌ల్ల‌గొండ‌. సెప్టెంబ‌ర్ 7, 1966లో పుట్టారు. త‌ల్లి జోగ‌మ్మ‌, తండ్రి కృష్ణ‌మాచారి. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక నిర్వ‌హించారు. విద్యార్థి నేత‌గా, సామాజిక కార్య‌క‌ర్త‌గా, విద్యాధికుడిగా, ప‌రిశోధ‌కుడిగా, క‌న్స‌ల్టెంట్ గా , కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా , రాజ‌కీయ నాయ‌కుడిగా వివిధ హోదాల‌లో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. ఎంఏ, ఎంబీఏ, పీహెచ్ డి చేశారు. విద్యార్థి ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌లో పాలు పంచుకున్నారు. స‌త్యం కంప్యూట‌ర్స్ (టెక్ మ‌హీంద్రా) లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గా , హెచ్ ఆర్ హెడ్ గా , హిటాచీ క‌న్స‌ల్టింగ్ లిమిటెడ్ లో హెచ్ ఆర్ డైరెక్ట‌ర్ గా కొంత కాలం పాటు ప‌ని చేశారు.

Dasoju Sravan Kumar Story

ఓయూ లోని ఐపీఎంలో సీనియ‌ర్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేశారు. వివిధ ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ స్థాయి మేనేజ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. ప‌బ్లిక్ పాల‌సీ, డెవ‌ల‌ప్ మెంట్ కు సంబంధించి అనేక ప్రాజెక్టుల‌లో ప‌ని చేశారు దాసోజు శ్ర‌వ‌ణ్‌(Dasoju Sravan Kumar). ప్ర‌పంచ బ్యాంక్ , డీఎఫ్ఐడీ, డీఓపీటీ, ఎన్ఎండీసీ, సింగ‌రేణి కాల‌రీస్ , హెచ్ జెడ్ ఎల్ , ఇండో స్విస్ ప్రాజెక్టు, త‌దిత‌ర సంస్థ‌ల‌తో క‌లిసి ప‌రిశోధ‌న‌, అభివృద్ధి క‌న్స‌ల్టింగ్ ప్రాజెక్టుల‌పై ప‌ని చేశారు . అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్టు అసోసియేట్ గా ఉన్నారు.

కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ఉద్య‌మంలో చురుకైన పాత్ర పోషించారు. జేఏసీలో స్టీరింగ్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు. జ‌య‌శంక‌ర్ కు స‌హాయ‌కుడిగా ఉన్నారు. తెలంగాణ పారిశ్రామికీక‌ర‌ణ కోసం విజ‌న్ ముసాయిదా రూపొందించ‌డంలో కేటీఆర్ కు చేదోడుగా ఉన్నారు. 2008లో ప్ర‌జా రాజ్యంలో ఉన్నారు. 2009లో సికింద్రాబాద్ పీఆర్పీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. టీఆర్ఎస్ లో చేరారు. 2014 లో పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ పార్టీ అధికార ప్ర‌తినిధిగా, జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శిగా పని చేశారు. 2018లో ఖైర‌తాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో ఏఐసీసీ ఎన్నిక‌ల వార్ రూమ్ లో కీల‌కంగా ఉన్నారు. బీహార్, ప‌శ్చిమ బెంగాల్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ , జార్ఖండ్ ల‌కు ఎన్నిక‌ల ఇంఛార్జ్ గా ప‌ని చేశారు దాసోజు శ్ర‌వ‌ణ్. రేవంత్ తో పొస‌గ‌క కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ వెంట‌నే బిజెపి కండువా క‌ప్పుకున్నారు. అక్క‌డ రాజీనామా చేసి తిరిగి భార‌త రాష్ట్ర స‌మితిలో చేరారు. ప్ర‌స్తుతం ఆ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు.

Also Read : Dasoju Sravan Satyanarayana : దాసోజు..కుర్రాకు బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!