DCW Chief : ఖాకీల తీరుపై డీసీడబ్ల్యూ చీఫ్ కన్నెర్ర
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓ గూండా
DCW Chief : జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియ చేస్తున్న మహిళా రెజ్లర్లపై ఢిల్లీ ఖాకీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్. అర్ధరాత్రి విషయం తెలుసుకున్న వెంటనే ఆమె జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఖాకీలకు వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన రాజ్యసభ ఎంపీ దీపిందర్ సింగ్ హూడాతో పాటు స్వాతి మలివాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వాతి మలివాల్. తాను ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థకు చీఫ్ నని , మీకు తనను ముట్టుకునే అర్హత లేదంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఓ వైపు నేరానికి పాల్పడిన , లైంగిక వేధింపులకు గురి చేస్తున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
అతడో గూండా అని సంచలన ఆరోపణలు చేశారు స్వాతి మలివాల్. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఉన్న పోలీసు అధికారి ఒకరు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ మహిళా రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.
Also Read : జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత