Delhi Cops To Wrestlers : రెజ్ల‌ర్లు ఆధారాలుంటే ఇవ్వండి

చిత్రాలు, వీడియోలు కావాలి

Delhi Cops To Wrestlers : మ‌హిళా రెజ్ల‌ర్ల కేసు రోజు రోజుకు కొత్త మ‌లుపు తిరుగుతోంది. విచార‌ణ చేప‌ట్టాల్సిన ఢిల్లీ పోలీసులు రోజుకో రీతిన ప్ర‌వ‌ర్తిస్తున్నారు. నిన్న సాక్షి మాలిక్ ను నేరుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ నివాసానికి తీసుకు వెళ్లారు. ఇప్ప‌టికే త‌న చేతిలో తామంతా బందీలం అయ్యామ‌ని, లైంగికంగా, శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని సంచ‌చ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆపై ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తీరా కోర్టుకు నివేదిక స‌మ‌ర్పించాల్సిన పోలీసులు రోజుకో మెలిక పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మ‌హిళా రెజ్ల‌ర్లు. మీటూ ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కావాల్సిన చిత్రాలు, వీడియోలు త‌మ‌కు ఇవ్వాల‌ని కోరారు. ఇందుకు సంబంధించి సీఆర్పీసీ 91 నోటీసు అందించారు. ఆధారాలు స‌మ‌ర్పించాల‌ని కోరారు. ఏమైనా వాట్సాప్ సందేశాలు ఉన్న‌ట్ల‌యితే త‌మ‌కు తెలియ చేయాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా ఫెడ‌రేష‌న్ చీఫ్ సింగ్ ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని భారీ ఎత్తున నిర‌స‌న తెలియ చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా కీల‌క పాత్ర పోషించిన బ‌జ‌రంగ్ పునియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీ పోలీసులు(Delhi Cops) స‌రైన రీతిలో ద‌ర్యాప్తు చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. బీజేపీ ఎంపీని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ముందు అరెస్ట్ చేస్తేనే త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు పునియా.

Also Read : V Srinivas Goud : సాహిత్యం తెలంగాణ సంప‌దత్వం

Leave A Reply

Your Email Id will not be published!