#Devotional : శివభక్తి పారవశ్య ప్రతి రూపం నేను నా శివుడు
Devotional : పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో గత మూడు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ,సేవా కార్యక్రమాలు నిర్వహించేశివుడు కళా సేవా స్రవంతి అనే ఆధ్యాత్మిక సేవా సంస్థ .కళలను ప్రోత్సహించడంలో భాగంగా "నేను నాశివుడు" అనే ఆధ్యాత్మిక లఘు చిత్రాన్ని రూపొందించారు.
Devotional : పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో గత మూడు సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ,సేవా కార్యక్రమాలు నిర్వహించేశివుడు కళా సేవా స్రవంతి అనే ఆధ్యాత్మిక సేవా సంస్థ .కళలను ప్రోత్సహించడంలో భాగంగా “నేను నాశివుడు” అనే ఆధ్యాత్మిక లఘు చిత్రాన్ని రూపొందించారు.
శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి అనుగ్రహంతో శివుడు కళా సేవా స్రవంతి ప్రొడక్షన్స్ పతాకంపై గౌరీ శంకర్ సమర్పణలో ప్రహరాజు సత్య వెంకట లక్ష్మీ సూర్యకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సత్యవరం, సిద్ధాంతం, వనంపల్లి గ్రామాల్లో మరియు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం లో 60 రోజుల పాటు జరిగిన ఈ చిత్రంలో మొత్తం 14 మంది నటీనటులు నటించారు.
ఈ చిత్ర విశేషాలను శివుడు సంస్థ సభ్యులు ఎల్.వి.ఎస్ మూర్తి, పి.వెంకట్రామయ్య మీడియాకు వివరిస్తూ.శివుడిని ఒక్కసారైనా మదిలో తలుచుకుంటే చాలు అనే లక్ష్యంతో నేను నా శివుడు చిత్రాన్ని ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన వారితో పాటు, యూనిట్ సభ్యులందరూ శివ భక్తులు కావడం విశేషమన్నారు.
ఈ చిత్రం తాత మనవడుల కథ గా రూపొందిందని చిత్రంలో4 వ తరగతి చదువుతున్న కార్తికేయ మనవడిగా నటించాడు శివునిపై భక్తి విశ్వాసాలతో సంప్రదాయంగా 50 రోజుల పాటు సాత్విక ఆహారాన్ని భుజించడం విశేషమని చెప్పారు. . పరమేశ్వరుని వేషం లో కూడా తన నటనతో అందరిని మెప్పిస్తాడని చెప్పారు. అలాగే తాత పాత్రధారిగా నటించిన సుబ్బారావు ఆర్మీ సిపాయి, పోస్టల్ ఉద్యోగిగా పని చేశారు. మహానటి చిత్రంతో పాటు అనేక సీరియల్స్ లో సినిమాల్లో నటించారని చెప్పారు. ప్రముఖ నటుడు,దర్శకుడు, రచయిత ఆయిన తనికెళ్ళ భరణిచే ఇటీవలే నేను నా శివుడు టైటిల్ సాంగ్,పోస్టర్ విడుదల చేసారని విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చినట్టు చెప్పారు.
No comment allowed please