Director Ravi Babu : చంద్రబాబు మంచోడు – రవి బాబు
టాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Director Ravi Babu : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, దర్శకుడు రవి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దర్శకుడు రవిబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే మనిషి చంద్రబాబు నాయుడు అంటూ కితాబు ఇచ్చారు. డబ్బుల కోసం ఏనాడూ కక్కుర్తి పడిన దాఖలాలు తనకు కనిపంచ లేదన్నారు.
Director Ravi Babu Comments Viral
ఎలాంటి ఆధారాలు లేకుండా ఎందుకని రాజమండ్రి కేంద్ర కార్మాగారంలో ఉంచారో తనకు అర్థం కావడం లేదన్నారు రవి బాబు(Director Ravi Babu). అక్రమ కేసులు పెట్టి, చంద్రబాబు నాయుడును వేధింపులకు గురి చేయడం మంచిది కాదని ఏపీ సీఎం జగన్ రెడ్డికి సలహా ఇచ్చారు.
73 ఏళ్ల వయసులో చంద్రబాబును హింసించడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు రవి బాబు. కనీసం బెయిల్ అయినా ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఆధారాలు లేకుండా అదుపులోకి తీసుకోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు దర్శకుడు.
Also Read : Minister KTR : అభివృద్ధికి చిరునామా తెలంగాణ