చెన్నై : అసలైన కాంగ్రెస్ పార్టీ తమతోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ పై నిప్పులు చెరిగారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ది కోసమే తను ఇలా మాట్లాడాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ విజయ్ కు హితవు పలికారు డిప్యూటీ సీఎం. ప్రజలు ఎవరు ఏమిటనేది గమనిస్తూ వుంటారని, అందుకు అనుగుణంగా పొలిటికల్ లీడర్లు ఆచితూచి మాట్లాడాలని అన్నారు. నోటికి వస్తే అది మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు డీకే శివకుమార్.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక అపరిపక్వ రాజకీయ నాయకుడంటూ ఎద్దేవా చేశారు. అతనికి రాజకీయ పరిణితి లేదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం. బహుశా అతనితో ఆ టీఎంసీ ఉండవచ్చంటూ పేర్కొన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తనకు మద్దతు ఇస్తానని ప్రకటించ లేదన్నారు. ఈ విషయం బహిరంగంగానే తెలియ చేసిందన్నారు. అయితే రాజకీయాలలో చర్చలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు డీకే శివకుమార్. తమ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీతోనే కలిసి ఉందని, ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో పక్కా మెజారిటీ వస్తుందని, మరోసారి పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు డిప్యూటీ సీఎం
