ED Attaches : జెట్ ఎయిర్ వేస్ ఆస్తులు జప్తు
మనీ లాండరింగ్ వ్యవహారం
ED Attaches : న్యూఢిల్లీ – కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారత దేశంలో పేరు పొందిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకు సంబంధించి ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
2002 నిబంధనల ప్రకారం మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా జెట్ ఎయిర్ వేస్ కు సంబంధించి భారత దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న ఆస్తులను అటాచ్ చేసినట్లు స్పష్టం చేసింది.
ED Attaches Jet Airways
తాత్కాలికంగా జెట్ ఎయిర్ వేస్ కు సంబంధించి రూ.538.05 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు పేర్కొంది ఈడీ. అటాచ్ చేసిన ఆస్తులకు సంబంధించి 17 రెసిడెన్షియల్ ఫ్లాట్ లు, బంగ్లాలు, వివిధ కంపెనీలు, వ్యక్తుల పేరుతో ఉన్న వాణిజ్య ప్రాంగణాలను అటాచ్ చేసినట్లు తెలిపింది.
జెట్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ , జెట్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , జెట్ ఎయిర్ వేస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గోయల్(Naresh Goyal) , ఆయన భార్య అనితా గోయల్, కుమారుడు నివాన్ గోయల్ లు భారత దేశంలో నివసించడం లేదని ఈడీ వెల్లడించింది. వీరంతా లండన్ , దుబాయ్ లలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని ప్రకటించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
Also Read : P Vijay Babu : ఆత్మీయ సమ్మేళనం అద్భుతం