Sanju Samson : ఆటలో భావోద్వేగాలు సహజం – శాంసన్
సందీప్ శర్మను తప్పు పట్టలేం
Sanju Samson : కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్(Sanju Samson) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ లోని జైపూర్ సవాయ్ మాన్సన్ స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఊహించని రీతిలో బోల్తా పడింది రాయల్స్ టీం. ఆఖరి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. హైదరాబాద్ ఆటగాడు సమద్ మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. ఆఖరి బంతికి 4 రన్స్ కావాల్సి ఉండగా సందీప్ శర్మ బౌలింగ్ లో సిక్స్ కొట్టడంతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్.
మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడాడు. భావోద్వేగాలు సహజమని కానీ ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదన్నాడు. ఆట పరంగా తాము అద్భుతంగా ఆడామని ప్రత్యేకించి జైశ్వాల్ , బట్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు.
కీలక సమయంలో ఎంతటి బౌలరైనా ఒత్తిడికి లోనవడం సహజమేనని పేర్కొన్నాడు సంజూ శాంసన్. నో బాల్ ను ఖండించాడు. ఆ సమయంలో మీరు లైన్ లో అడుగు పెట్టలేరన్నాడు. అందుకే ఐపీఎల్ అంటే విపరీతమైన అభిమానం కలిగి ఉంటారన్నాడు శాంసన్. మీరు గేమ్ ను చివరి దాకా పూర్తయ్యేంత దాకా గెలిచినట్లు అనుకోలేం అన్నాడు. నో బాల్ మా కొంప ముంచిందన్నాడు. శర్మ చెన్నై పై గెలిచేలా చేశాడని గుర్తు చేశాడు.
Also Read : సంజూ శాంసన్ సెన్సేషన్
