BCCI Ethics Officer : బీసీసీఐ చీఫ్ కు ఎథిక్స్ ఆఫీసర్ నోటీసు
డిసెంబర్ 20 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
BCCI Ethics Officer : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనకు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్(BCCI Ethics Officer) ఏకంగా నోటీసులు జారీ చేశారు. బిన్నీపై వివాదాస్పద ప్రయోజనాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 20 డెడ్ లైన్ విధించారు. రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ సరన్ ఈ నోటీసు జారీ చేశారు. దీనిని ఆయన అధికారికంగా ధ్రువీకరించారు కూడా.
ప్రస్తుతం కోట్లాది రూపాయల ఆదాయం కలిగి ఉంది బీసీసీఐ. తన కోడలు భారత క్రికెట్ కు హోమ్ సీజన్ మీడియా హక్కులను కలిగి ఉన్న స్టార్ స్పోర్ట్స్ లో పని చేస్తున్నారు. రోజర్ బిన్నీ విభేదిస్తున్నారంటూ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ సరన్ కు ఫిర్యాదుదారు సంజీవ్ గుప్తా ఆరోపించారు.
ఇందులో భాగంగా బీసీసీఐ రూల్ 38(1) (i) రూల్ 38(2)ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ 39(2)(బి) కింద ఫిర్యాదు అందిందని బిన్నీకి ఇచ్చిన నోటీసులో తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు. లేనట్లయితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన బీసీసీఐ ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ బీసీసీఐ బాస్ గా ఎన్నికయ్యారు. అంతకు ముందు సౌరవ్ గంగూలీ ఉన్నారు. కాగా బీసీసీఐ బాస్ కు నోటీసు జారీ చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : బీసీసీఐ నిర్వాకం పంత్ కు అందలం