Ex Minister KTR in Arjun Reddy Look: అర్జున్‌ రెడ్డి లుక్ లో కేటీఆర్‌ ! స్టన్నింగ్ లుక్ కు అభిమానుల ఫిదా !

అర్జున్‌ రెడ్డి లుక్ లో కేటీఆర్‌ ! స్టన్నింగ్ లుక్ కు అభిమానుల ఫిదా !

Ex Minister KTR: తెలంగాణా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్‌ ఎప్పుడూ నీట్ షేవ్‌తో డీసెంట్‌ లుక్‌లోనే కనిపిస్తూ ఉంటారు. మీసాలు, గడ్డం పెంచుకోకుండా సింపుల్ హెయిర్ స్టయిల్‌ తో కనిపిస్తారు. మరి అలాంటి కేటీఆర్… ఒక్కసారిగా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ లుక్ లో దర్శనమిచ్చారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల్లో ఉండే కేటీఆర్… అంత సడన్ గా అర్జున్ రెడ్డి లుక్ ఎలా సాధ్యం అయింది అనుకుంటున్నారా ? అయితే కేటీఆర్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లోకి వెళ్లి స్వయంగా కేటీఆర్ పెట్టిన ఫోటోలు చూడాల్సిందే.

Ex Minister KTR – అర్జున్ రెడ్డి లుక్ లో ఉన్న తన ఫోటోను ఎక్స్ లో ఫోస్ట్ చేసిన కేటీఆర్ !

పొడవాటి జుట్టు, గడ్డం, మీసంతో అర్జున్ రెడ్డి లుక్ లో ఉన్న తన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసారు మాజీ మంత్రి కేటీఆర్(Ex Minister KTR). అయితే డీసెంట్ లుక్‌ నుంచి రౌడీ లుక్‌ కు మారిన కేటీఆర్‌ ఫోటోను ఆశ్చర్యపోతున్నవారికి వెంటనే కింద క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి. ఓ అభిమాని తన ఫోటోను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ద్వారా అర్జున్ రెడ్డి గెటప్ లో ఎడిట్ చేసి కేటీఆర్ కు పంపించడంతో… ఆ ఫొటో కేటీఆర్‌కు బాగా నచ్చడంతో దాన్ని తన అధికారిక ఎక్స్‌లో (ట్విటర్‌)షేర్‌ చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్‌ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్‌ చేస్తున్నా’ అనే క్యాప్షన్‌ ఇస్తూ కేటీఆర్‌ ఆ ఫొటోను షేర్‌ చేశారు. దాని కింద ‘నేను నా జుట్టు, గడ్డం పెంచుకుంటే’ అని ఓ ట్యాగ్‌లైన్‌ రాశారు. దాన్ని నవ్వుతున్న ఎమోజీని ఆడ్‌ చేశారు. దీనితో కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : PM Narendra Modi Launches New Scheme: అయోధ్య రాముని ఆశీస్సులతో కొత్త పథకం ప్రకటించిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!