FIFA Prize Money 2022 : అర్జెంటీనా థిల్లానా భారీ నజరానా
$ 47 మిలియన్ డాలర్లు రూ. 3.47 బిలియన్లు
FIFA Prize Money 2022 : ప్రపంచ కప్ సంబురం ముగిసింది. విశ్వ విజేతగా నిలిచిన జట్టుకు ఎన్ని కోట్లు(FIFA Prize Money 2022) ముడుతాయనే దానిపై ఉత్కంఠ ఉండడం సహజం. ఏకంగా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫైనల్ లో ఫ్రాన్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. భారీగా ప్రైజ్ మనీ తీసుకు వెళుతుంది.
అర్జెంటీనాకు $47 మిలియన్ డాలర్లు. రూ. 3.47 బిలియన్ల భారీ నజరానా దక్కుతుంది. ఇక రన్నరప్ గా నిలిచిన ఫ్రాన్స్ కు $ 30 మిలియన్ డాలర్లు. అంటే రూ. 2.48 బిలియన్లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు $27 మిలియన్ డాలర్లు . అంటే రూ. 2.39 బిలియన్లు.
ఇక నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు $25 మిలియన్ డాలర్లు . రూ. 2.06 బిలియన్లు. మొదటి నాలుగు స్థానాలలో అర్జెంటీనా, ఫ్రాన్స్ , మొరాకో, క్రొయేషియా ఉన్నాయి. టోర్నీ పరంగా క్వార్టర్ ఫైనల్ కు చేరిన జట్లు బ్రెజిల్ , నెదర్లాండ్స్ , పోర్చుగల్ , ఇంగ్లాండ్ . ఒక్కో జట్టు $17 మిలియన్ డాలర్లతో వెనుదిరిగాయి.
అదే సమయంలో అమెరికా, సెనెగల్ , ఆస్ట్రేలియా, పోలాండ్ , స్పెయిన్, జపాన్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియాతో కలిపి మొత్తం 16 జట్లకు ఒక్కో జట్టుకు $13 మిలియన్ డాలర్లు దక్కాయి.
మరో వైపు ఖతార్, ఈక్వెడార్ , వేల్స్ , ఇరాన్ , మెక్సికో, సౌదీ అరేబియా, డెన్మార్క్ , ట్యునీషియా, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా, సెర్బియా, కామెరూన్ , ఘనా , ఉరుగ్వే జట్లు గ్రూప్ దశల్లో పాల్గొన్నందుకు ఒక్కో జట్టుకు $9 మిలియన్ డాలర్ల చొప్పున అందుకున్నాయి.
ఇక మన భారతీయ రూపాయలలో చూస్తే అర్జెంటీనాకు రూ. 347 కోట్లు, ఫ్రాన్స్ కు రూ. 248 కోట్లు, క్రొయేషియా, మొరాకోకు రూ. 223 కోట్లు, రూ. 206 కోట్లు అందుకున్నాయి.
క్వార్టర్ ఫైనల్స్ నుండి నిష్క్రమించిన జట్లు అంటే 5 నుంచి8వ స్థానం వరకు ఒక్కో జట్టుకు రూ. 140 కోట్లు దక్కుతాయి. ఇక 9 నుంచి 16వ స్థానం వరకు ఒక్కో జట్టుకు రూ. 107 కోట్లు , ఇక 17 నుంచి 32 వరకు నిలిచిన జట్లకు ఒక్కో జట్లుకు రూ. 74 కోట్లు దక్కాయి.
Also Read : ఐపీఎల్ వేలంలో ఆ ఆటగాళ్లకే డిమాండ్