PM Modi : ఇంధ‌నం దేశానికి అవ‌స‌రం – మోదీ

ప‌ల్లెల‌కు ఫైబ‌ర్ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ

PM Modi : అపార‌మైన వ‌న‌రుల‌ను క‌లిగి ఉన్న‌ది భార‌త దేశం. ప్ర‌త్యేకించి యావ‌త్ ప్ర‌పంచం ఇంధ‌నంపై ఆధార‌ప‌డింది. మ‌నం కూడా స్వ‌యం స‌మృద్దిని సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) . దేశంలో ఇంధ‌నాన్ని వెలికి తీసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఆయిల్ , గ్యాస్ నిల్వ‌ల‌ను వెలికి తీసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు, ప్ర‌తినిధులు ముందుకు రావాల‌ని కోరారు న‌రేంద్ర మోదీ. గ్రీన్ హైడ్రోజ‌న్ తో పాటు రెన్యూవ‌బుల్ ఎనర్జీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాల‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌కు, ఔత్సాహికుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌న్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్క‌డ ఇన్వెస్ట్ చేయొచ్చ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి. ప్ర‌త్యేకించి శ‌క్తి ప‌రివ‌ర్త‌న రంగం వేగంగా వృద్ది చెందుతోంద‌న్నారు. రానున్న 10 ఏళ్ల‌లో ఆయిల్ కు భారీగా డిమాండ్ ఉండ‌నుంద‌న్నారు.

ప్ర‌పంచ ఆయిల్ డిమాండ్ లో భార‌త దేశానికి చెందిన వాటా 5 శాతం మాత్ర‌మే ఉంద‌న్నారు. 11 శాతానికి పెరుగుతుంద‌ని అంచ‌నా. ఇదే స‌మ‌యంలో గ్యాస్ డిమాండ్ 500 శాతానికి పెరగ‌డం ఖాయ‌మ‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి.

ఇదే స‌మ‌యంలో న‌రేంద్ర మోదీ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని గ్రామాల‌కు ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాన్ని అందించేందుకు 6 ల‌క్ష‌ల‌కు పైగా ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) .

అంతే కాకుండా గ్యాస్ పైప్ లైన్ నెట్ వ‌ర్క్ వ‌చ్చే నాలుగేళ్ల‌లో 22 వేల కిమీట‌ర్ల నుంచి 35 వేల కిలోమీట‌ర్లు పెరుగుతుంద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

Also Read : వాట్సాప్ ద్వారా రైళ్ల‌లో ఫుడ్ ఆర్డ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!