Mamata Banerjee : గంగూలీని అన్యాయంగా తప్పించారు – దీదీ
దాదాను ఐసీసీకి పంపాలని పీఎంకు లేఖ
Mamata Banerjee : గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ రంగు పులుముకుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) బాస్ పోస్ట్. అక్టోబర్ 18న కొత్త కార్యవర్గం ఎన్నిక కానుంది. ఇప్పటికే పేర్లు కూడా బయటకు వచ్చేశాయి. ఎన్నిక అనేది నామమాత్రమే. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా(Jay Shah) మరోసారి కార్యదర్శిగా ఎన్నిక కానున్నారు.
కోట్లాది రూపాయలు కలిగిన బీసీసీఐ ఇప్పుడు జే షా కనుసన్నలలో నడవనుంది. దీనిపై ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిలదీశారు. జే షా ఎన్ని సెంచరీలు సాధించాడంటూ ప్రశ్నించాడు. ఈ తరుణంలో మరోసారి బీసీసీఐ బాస్ కావాలని కోరిక ఉన్నా గంగూలీని(Sourav Ganguly) పొమ్మనకుండా పొగ పెట్టారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
చివరకు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. సోమవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన కామెంట్స్ చేశారు. కొందరు కావాలనే బీసీసీఐలో పోటీ చేయకుండా అవమానించారంటూ ఆరోపించారు. ఈ మేరకు సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
బీసీసీఐ చైర్మన్ గా మూడు సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించాడని పేర్కొన్నారు మమతా బెనర్జీ. గంగూలీని అన్యాయంగా తప్పించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అతను చాలా కోల్పోయాడు. నేను షాక్ అయ్యాను.
గంగూలీ చాలా పాపులర్. భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. దేశానికి చాలా సేవలు చేశాడని పేర్కొన్నారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : దాదా పనితీరుపై విమర్శలు సరికాదు – ధుమాల్
Honourable CM @MamataOfficial bats for @SGanguly99, asks why is Jay Shah still in #BCCI while #SouravGanguly has been removed! And she appeals to PM #Modi to send Sourav Ganguly to ICC. Says Dada is being deprived. pic.twitter.com/Wxw2Zmi3lR
— Spandan Gain (@SpandanGainAITC) October 17, 2022