Gautam Adani : ప్రపంచంలో అదానీ రెండో కుబేరుడు
అత్యంత సంపన్న వ్యక్తిగా చోటు
Gautam Adani : భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
అమెజాన్ చైర్మన్ , సిఇఓ జెఫ్ బెజోస్ , బెర్నార్డ్ ఆర్నాల్డ్ లను అధిగమించి రూ. $154.7 బిలియన్ల నికర విలువతో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కానీ కొద్ది కాలం మాత్రమే.
గౌతమ్ అదానీ ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో ఎలోన్ మస్క్ , బెర్నార్డ్ ఆర్నాల్డ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఎలోన్ మస్క్ $237.5 బిలియన్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడు.
గత నెలలో అదానీ ఆర్నాల్డ్ ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నారు. మస్క్, బెజోస్ ల వెనుక ఉన్నారు. ఈసారి కొద్ది కాలం పాటు బెజోస్ ను అధిగమించాడు గౌతం అదానీ(Gautam Adani).
మరో వైపు రెండో స్థానాన్ని ఆక్రమించడంతో ఆర్నాల్డ్ కుటుంబ నికర విలువ $153.5 బిలియన్లకు మూడో స్థానానికి నెట్టబడ్డాడు. అది $4.9 బిలియన్లకు తగ్గింది.
ఆర్నాల్డ్ తన సంపద మొత్తం $152.8 బిలియన్లతో తిరిగి ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. అయినప్పటికీ అది మరింత పడి పోయింది.
అదానీ సంపద అదే సమయంలో లాభాలు $4 బిలియన్ల నుండి $1.1 బిలియన్లకు తగ్గడంతో $151.3 బిలియన్లకు పడి పోయింది. ఆయన మూడో స్థానంలో స్థిరపడ్డారు.
బెజోస్ 2.3 బిలియన్ డాలర్లు క్షీణించిన $149.7 బిలియన్ల సంపదతో నాల్గో స్థానంలో ఉన్నారు. రిలియన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ 92 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు.
కాగా అదానీ మౌలిక సదుపాయాలు, మైనింగ్, ఇంధనం, ఇతర రంగాలలో విస్తరించారు. ఏడు కంపెనీలకు అదానీ గ్రూపు విస్తరించింది.
Also Read : రూ. 300 కోట్లు దాటిన బ్రహ్మాస్త్ర చిత్రం