Glenn Maxwell Comment : మగ (మ్యాక్స్ ) ధీరుడు అజేయుడు
మ్యాక్స్ వెల్ మార్వోలెస్
Glenn Maxwell Comment : ప్రపంచ క్రికెట్ రంగంలో అద్భుతం చోటు చేసుకుంది. ఏ ఫార్మాట్ లోనైనా ఇదే అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ మాజీ క్రికెటర్లు కితాబు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell) ఆడిన ఇన్నింగ్స్ . ఒకటా రెండా ఏకంగా పరుగుల వరద పారించాడు. ఆటను ఆటగా ఎలా ఆడాలో చూపించాడు. ఒక రకంగా కోట్లాది మందికి మ్యాక్స్ లోని విధ్వంసాన్ని చూసి, ఆట పట్ల తనకు ఉన్న నిబద్దత గురించి విస్తు పోయారు.
కాసుల వేటగా మారి పోయిన క్రికెట్ లో విజయం కోసం విరామం అన్నది లేకుండా చివరి దాకా పోరాడిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు వికెట్లు టపా టపా రాలి పోతున్నా ఎక్కడా తగ్గలేదు. తన దేశం కోసం ఆడాడు. తన జెండా రెప రెప లాడుతుంటే చూడాలని ఉందని , అది గెలుపు సాధించినప్పుడు మాత్రమే జరుగుతుందని అందుకే తాను ఓటమిని ఒప్పుకోనంటూ ప్రకటించాడు మ్యాచ్ తర్వాత.
Glenn Maxwell Comment Viral
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. ఇతర జట్లకు ఆస్ట్రేలియా(Australia) జట్లకు ఉన్న తేడా అదే. ఒకరు ఆడక పోయినా ఇంకొకరు ఆడేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్లలో ఎవరూ కూడా గెలుపు ఓటముల గురించి పట్టించుకోరు. కానీ ఓడి పోయినప్పుడు ఎక్కడ తప్పులు చేశామో పరిశీలిస్తారు. మళ్లీ ఆ తప్పులు తిరిగి రాకుండా జాగ్రత్త పడతారు. అంతే కాదు గెలిచామని సంబురాలు చేసుకున్నా వాటిని అక్కడి వరకే పరిమితం చేస్తారు. మళ్లీ యుద్ద రంగంలోకి దూకుతారు. దేశానికి సరిహద్దు కాపలా కాసే సైనికుడిలా గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడాడంటూ కితాబు ఇచ్చారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. అంతకు మించిన రికార్డులు ఉన్నాయి. కానీ భారత్ లోని ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ మాత్రం గెలుపు ఎలా సాధించాలనే దానికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
ప్రత్యర్థి ఆఫ్గనిస్తాన్ విసిరిన లక్ష్యం . 292 రన్స్. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఏ కోశాన ఆసిస్ గెలుస్తుందన్న నమ్మకం లేదు. కానీ ఇదే 1983లో భారత జట్టు కెప్టెన్ వెస్టిండీస్ తో ఆడిన మ్యాచ్ లో కపిల్ దేవ్ విరోచిత ఇన్నింగ్స్ ను తలపింప చేసింది. అతను కూడా నిజమైన భారతీయుడు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో కంట తడి పెట్టాడు. ఇవాళ ఆస్ట్రేలియా కప్ గెలిచినా గెలవక పోయినా గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell) మాత్రం కోట్లాది గుండెల్లో నిక్షిప్తమై ఉంటాడు.
ఎందుకంటే ఓ వైపు కండరాల నొప్పి, ఇంకో వైపు కాలు నిలిచే పరిస్థితి లేదు. ఇంకో వైపు తనొక్కడే ఆడాల్సి ఉంది. కానీ శివాలెత్తినట్లు ఆడాడు. క్రికెట్ పుస్తకంలో ఉన్న షాట్స్ నన్నింటినీ ఆడేశాడు. ఓటమి అంచుల నుంచి ఆస్ట్రేలియాలను సగర్వంగా గెలుపు వాకిట్లోకి తీసుకు వచ్చాడు మ్యాక్స్ వెల్. 201 రన్స్ చేశాడు. 10 సిక్సర్లు 14 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా నేటి యువతకు, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులకు మ్యాక్స్ మగ ధీరుడి లాగా కనిపిస్తున్నాడు కదూ.
Also Read : AUS vs AFG ICC World Cup : ఆఫ్గాన్ పరేషాన్ ఆసిస్ సెన్సేషన్