Gold Price : రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ పై దాడి కి పాల్పడడంతో అటు ఆయిల్ ధరలతో పాటు ఇటు బంగారం ధరలు మండుతున్నాయి. అంతర్జాతీయంగా వార్ ప్రభావం దెబ్బకు పసిడిపై(Gold Price) అత్యధిక ప్రభావం పడింది.
ఎంసీఎక్స్ లో బంగారం ధర ఏకంగా గరిష్ట స్థాయికి చేరింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 750 రూపాయలకు పెరిగింది. ఔన్స్ పసిడి ధర 1950 డాలర్లకు చేరుకుంది.
త్వరలో భారీ ఎత్తున పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపు 60 వేలకు చేరే ఛాన్స్ ఉందంటూ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తాజాగా మార్కెట్ ధర ప్రకారం చూస్తే న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 1300 కి పెరిగింది.
ఇక్కడ ధర రూ. 51 వేల 419 కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల ధర రూ. 45 వేల 870 నుంచి రూ. 47 వేలకు పెరిగింది. ఒక్క రోజులో రూ. 850 కి పెరగడం విశేషం.
బిస్కెట్ బంగారం ధర(Gold Price) రూ. 930 పెరిగి రూ. 51 వేల 110కి చేరుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఆభరణాలు తయారు చేయించు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఉన్నట్టుండి పెరగడంతో కొనుగోలు దారులకు కోలుకోలేని షాక్ తగింది. మహిళలు బంగారు దుకాణాలకు బారులు తీరారు. ఈ తరుణంలో బిస్కట్ల ధర కూడా భారీగా పెరిగింది.
మరో వైపు బంగారు మాదిరి గానే వెండి ధర కూడా ఊహించని రీతిలో భారీగా పెరిగింది. దీంతో సామాన్యులకు బంగారం, వెండి కొనే పరిస్థితి లేదు. ఇప్పట్లో ఆభరణాలు, పసిడి ధరలు తగ్గే ఛాన్స్ లేదు.
Also Read : ‘విమెన్ ఆఫ్ ఇన్నోవేషన్’ స్టార్ట్