H1B Workers : హెచ్-1బీ వీసాదారులకు ఖుష్ కబర్
180 రోజులకు పొడిగించిన యుఎస్ సర్కార్
H1B Workers : ఓ వైపు ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు కీలక రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ప్రధానంగా ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , మీడియా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ , ఫేస్ బుక్ మెటా, మైక్రో సాఫ్ట్ , గూగుల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యగులను తొలగించాయి. దీంతో ఆయా సంస్థలలో పని చేస్తూ జాబ్స్ కోల్పోయిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొలువులు కోల్పోయిన వారు గనుక 60 రోజుల పాటు ఖాళీగా ఉంటే అమెరికా దేశాన్ని వీడాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విన్నవించడంతో పాటు భారత దేశ ప్రభుత్వం కూడా అమెరికా సర్కార్ తో సంప్రదింపులు జరిపింది. ఆంటోనీ బ్లింకెన్ తో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కలిసి చర్చించారు. చర్చలు ఫలించాయి. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం 180 రోజులకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.
అధ్యక్ష సలహా ఉప సంఘం సిఫార్సు చేసింది. దీని వల్ల హెచ్ -1బీ వీసాదారులకు(H1B Workers) ఉపశమనం కలిగింది. గ్రేస్ పీరియడ్ పెంచాలని కోరింది. ఇవి గనుక అమలులోకి వస్తే జాబ్స్ కోల్పోయిన వారికి భారీ ఊరట లభించనుంది.
గత ఆరు నెలల నుంచి వరుసగా కంపెనీలు ఉద్యోగులను తీసి వేస్తూ వస్తున్నాయి. ఉన్న ఉద్యోగాలు కోల్పయిన వారికి తక్కువ సమయం ఉండడంతో జాబ్స్ దొరికే పరిస్థితి లేదు. ఈ తరుణంలో సర్కార్ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
Also Read : ధన్య రాజేంద్రన్ కు పురస్కారం