Hardik Pandya Sledges : పాండ్యా తీరుపై సర్వత్రా ఆగ్రహం
సంజూ శాంసన్ ను స్లెడ్జ్ చేయబోయిన పాండ్యా
Hardik Pandya Sledges : ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. స్లెడ్జింగ్ అనేది మామూలై పోయింది ప్రధానంగా పాపులర్ గా మారిన క్రికెట్ లో. ఇలాంటి చేష్టలు వాళ్లకు ఆనందం కలిగిస్తాయేమో కానీ క్రీడా స్పూర్తిని కలిగించవు. గత కొంత కాలం నుంచీ సంజూ శాంసన్ పట్ల బీసీసీఐ కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. మిగతా ఆటగాళ్లు ఆడక పోయినా వారిని జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తూ వస్తోంది.
ఇది పక్కన పెడితే అహ్మదాబాద్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ హోరా హోరీగా సాగింది. కానీ గుజరాత్ ఆధిపత్యానికి గండి కొట్టింది రాజస్థాన్ రాయల్స్. కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగి ఆడితే షిమ్రోన్ హిట్మెయర్ రెచ్చి పోయాడు. సంజూ 32 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 60 రన్స్ చేశాడు. ఇక షిమ్రోన్ 26 బంతులు ఆడి 56 రన్స్ చేశాడు.ఇందులో 2 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఓ వైపు తన ఆట తాను ఆడుతున్న సంజూ శాంసన్ వద్దకు కావాలని జోక్యం చేసుకునే ప్రయత్నం చేశాడు గుజరాత్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya Sledges). ఒక రకంగా స్లెడ్జింగ్ చేసేందుకు యత్నించడం తీవ్ర ఆగ్రహానికి తెప్పించింది. పూర్తిగా కూల్ గా ఉండే సంజూ శాంసన్ వీటిని పట్టించు కోలేదు. తనంతకు తానుగా ఆడటం మొదలు పెట్టాడు. గుజరాత్ బౌలర్ల భరతం పట్టాడు. కానీ పాండ్యా ప్రవర్తించిన తీరు క్రీడా స్పూర్తికి విరుద్దమంటూ పేర్కొంటున్నారు ఫ్యాన్స్. ఏది ఏమైనా మరోసారి శాంసన్ హీరోగా మారాడు.
Also Read : అహ్మదాబాద్ లో శాంసన్ ఫీవర్