Robbie Coltrane : హ్యారీ పోట‌ర్ స్టార్ రాబో కోల్ట్రేన్ ఇక లేరు

సెల‌వంటూ వెళ్లిపోయిన దిగ్గ‌జ న‌టుడు

Robbie Coltrane : ప్ర‌పంచ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకుని కోట్లాది అభిమాల‌ను త‌న న‌ట‌న‌తో అల‌రిస్తూ వ‌చ్చిన హ్యారీ పోట‌ర్ స్టార్ రాబో కోల్ట్రేన్ క‌న్ను మూశారు. ఆయ‌న‌కు 72 ఏళ్లు. ఆయ‌న మ‌ర‌ణంతో యావంత్ సినీ లోకం తీవ్ర విషాదానికి లోనైంది. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇమిడి పోగ‌లిగిన ప్ర‌తిభా నైపుణ్యం ఆయ‌న స్వంతం.

వ‌య‌స్సు మీద ప‌డినా అంత‌కంత‌కూ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చారు. నిత్యం న‌ట‌నా ప‌రంగా మెరుగులు దిద్దుకుంటూ హాలీవుడ్ లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన న‌టుడిగా త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు రాబో కోల్ట్రేన్(Robbie Coltrane).

హ్యారీ పోట‌ర్ సినిమాల్లో హాగ్రిడ్ వంటి పాత్ర‌లు, టీవీ సీరీస్ క్రాక‌ర్ లో నేరాల‌ను ప‌రిష్క‌రించే మ‌న‌స్త‌త్వ వేత్త గా ఆయ‌న న‌ట‌న అజ‌రామ‌రంగా నిలిచి పోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇలాంటి పాత్రలు ఆయ‌న‌ను క‌ల‌కాలం గుర్తుంచుకునేలా చేశాయి. హ్యారీ పోట‌ర్ ర‌చ‌యిత జేకే రౌలింగ్ న‌టుడు రాబో కోల్ట్రేన్ ఇక లేర‌న్న వాస్త‌వాన్ని జీర్ణించు కోలేక పోతున్నాన‌ని పేర్కొంది.

అత‌నితో క‌లిసి జీవించ‌డం మ‌రిచి పోలేని అనుభ‌వ‌మ‌ని పేర్కొన్నారు. అంతే కాదు కోల్ట్రేన్ అసాధార‌ణ‌మైన అద్భుత‌మైన ప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారుడు. సంపూర్ణ‌మైన వ్య‌క్తి. అత‌డితో సంభాషించ‌డం, అత‌డితో క‌లిసి ప‌ని చేయ‌డం , అత‌డితో అన్ని ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డం నా అదృష్ట‌మ‌న్నారు.

రాబీ కోల్ట్రేన్(Robbie Coltrane) మ‌ర‌ణించిన త‌ర్వాత రెస్ట్ ఇన్ పీస్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అవుతోంది. దిగ్గ‌జ న‌టుడికి యావ‌త్ ప్ర‌పంచం నివాళులు అర్పిస్తోంది.

Also Read : గ‌రిక‌పాటి వివాదానికి ‘చిరు’ పుల్ స్టాప్

Leave A Reply

Your Email Id will not be published!