Harsha Bhogle Samson : బీసీసీఐపై హర్ష భోగ్లే షాకింగ్ కామెంట్స్
సంజూ శాంసన్ జట్టులో ఉండాల్సిన క్రికెటర్
Harsha Bhogle Samson : ఐపీఎల్ 16వ సీజన్ లో గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది రాజస్థాన్ రాయల్స్. మొదట్లో తడబడినా ఆ తర్వాత దుమ్ము రేపింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఒకానొక దశలో 26 పరుగులకే 2 వికెట్లు పోయిన తరుణంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాడు.
32 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. మొత్తం 60 పరుగులు చేశాడు. అతడితో పాటు విండీస్ స్టార్ క్రికెటర్ షిమ్రోన్ హిట్మెయర్ దంచి కొట్టాడు. గుజరాత్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. 26 బంతులు ఎదుర్కొని 56 రన్స్ చేశాడు. మ్యాచ్ ఫినిషర్ గా మారాడు మరోసారి.
3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే షాకింగ్ కామెంట్స్ చేశాడు. సంజూ శాంసన్(Sanju Samson) ఆట తీరు అద్భుతం అంటూ కితాబు ఇచ్చాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తోందంటూ ప్రశ్నించాడు.
అంతే కాదు తాను గనుక సెలెక్టర్ అయితే ప్రతి టి20 మ్యాచ్ లో సంజూ శాంసన్ ఆడాలని కోరుకుంటానని కుండ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం నెట్టింట్లో హర్ష భోగ్లే(Harsha Bhogle Samson) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీసీసీఐపై ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. త్వరలో జరిగే వరల్డ్ కప్ లో అతడిని ఆడించాలని కోరుతున్నారు.
Also Read : చెన్నై గెలిచేనా బెంగళూరు నిలిచేనా