రాజకీయ ప్రయోజనాల కోసం స‌ర్ ను ఉప‌యోగిస్తే ఎలా..?

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ నిర్వాకంపై నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. శ‌నివారం దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ ఎత్తున సీజేపీ ఆధ్వ‌ర్యంలో జెన్ జీలు ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ త‌రుణంలో తీవ్రంగా స్పందించారు సీఎం డీకే శివ‌కుమార్. రాజకీయ ప్రయోజనాల కోసం స‌ర్ ప్ర‌క్రియ‌ను ఉప‌యోగిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు సీఎం. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మెజారిటీ నిర్ణయాలు తీసుకోవడం లేదని తేలిందని, ఈ పరిస్థితిపై “ఎవరూ సంతృప్తి చెందలేదని పేర్కొన్నారు. ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఏకంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల‌కు పైగా ఓట్లు కోల్పోవ‌డం దారుణ‌మ‌న్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నారు..ఎందుకు చేశార‌నే దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు డీకే శివ‌కుమార్.

బెంగ‌ళూరులో సీఎం మీడియాతో మాట్లాడారు. అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇది ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వం కాదని ఎన్నికల కమిషన్‌పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మెజారిటీ నిర్ణయాలు తీసుకోవడం లేదని స్పష్టమైందని అన్నారు. ఈ విష‌యాన్ని ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ లో రితికా రాసింద‌న్నారు. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. సీజేపీ ఆందోళ‌న‌కు తాము కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని చెప్పారు సీఎం. వాస్తవానికి, ప్రతిపక్ష పార్టీలకు తమ ఆందోళనలను వ్యక్తీకరించే హక్కు ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ముందస్తు నిధులు విడుదల చేసిందో లేదో స్పష్టం చేయాలని శివకుమార్ కేంద్రాన్ని కోరారు. వాళ్లు ఏమైనా ఆలోచించుకోనివ్వండి.. వాళ్ల బాధ్యత ఏమిటో అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!