న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని లాక్మా కు హాజరైన తొలి భారతీయ నటుడిగా హృతిక్ రోషన్ నిలిచారు. ఆర్ట్ ఫిల్మ్ గాలా 15వ ఎడిషన్‌లో హాజరైన తొలి భారతీయ నటుడిగా నిలిచారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియోలలో ఆ నటుడు ముదురు నీలం రంగు టక్సేడో ధరించి, దానికి సరిపోయే బోతో ఫోటోలకు పోజులిచ్చే ముందు ఫోటోగ్రాఫర్లను పలకరిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమం నవంబర్ 7న జరిగింది. రోషన్‌తో పాటు లాక్మాకు నటులు అన్యా టేలర్-జాయ్, ఆండ్రూ గార్ఫీల్డ్, తిమోతీ చాలమెట్, జూలియా గార్నర్, సారా పాల్సన్, వయోలా డేవిస్, అల్ పసినో, టామ్ హాంక్స్, సోఫియా వెర్గారా, ఎమ్మా వాట్సన్, మాడెలిన్ పెట్ష్, పార్కర్ పోసీ, మరియు రూఫస్ సెవెల్ తదితరులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన పూర్తి పరు హృతిక్ రాకేష్ నగ్రత్. మహారాష్ట్రలోని ముంబైలో జనవరి 10, 1974లో పుట్టాడు. తన తండ్రి ప్రముఖ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ , తల్లి పింకీ రోషన్. నటుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు. 1980లో బాలనటుడిగా సినిమాల్లో కనిపించారు. 2000లో తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా భారీ విజయం సాధించి ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. 2003లో వచ్చిన కోయి మిల్ గయా మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2006లో క్రిష్ , 2008లో వచ్చిన జోహా అక్బర్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
