నేను రాజ కుటుంబం నుండి రాలేదు : టీవీకే విజ‌య్

నేను మీ వాడిని..మీలో ఒక‌డిన‌ని ప్ర‌క‌టించిన నూత‌న సీఎం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా ఆదివారం అఅశేష జ‌న‌వాహిని మ‌ధ్య టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య చంద్ర‌శేఖ‌ర్. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. నేను రాజ కుటుంబం నుండి రాలేదు. నేను మీ కొడుకులా, మీ కూతురిలా, మీ అన్నలా, లేదా మీ తమ్ముడిలా ఉంటాన‌ని అన్నారు. నన్ను నేను అలానే చూసుకుంటాను అని చెప్పారు. మీరు నన్ను ఆ విధంగా చూడటం వల్లే నాకు సినిమా రంగంలో ఇంత గొప్ప స్థానం ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు, వాటన్నింటినీ పక్కనపెట్టి, మీకు నా కృతజ్ఞతా రుణం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా, మీరు నన్ను ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో ఆలింగనం చేసుకుని, న‌న్ను దీవించార‌ని అన్నారు.

జెన్ జెడ్ ఓటర్ల నుండి తనకు లభించిన మద్దతును ప్ర‌స్తావించారు. ‘విజయ్ మామ అని పిలిచే వారంద‌రికి ఒక్క‌టే చెబుతున్నా మీకు నేను ఎల్ల‌వేళ‌లా ఉంటాన‌ని చెప్పారు. స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారందరి వల్లే ఇదంతా జరిగిందన్నారు విజ‌య్. మీ భవిష్యత్తు కోసం పనిచేయడం ద్వారా మీకు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్కును దాటడంలో టీవీకేకు ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా వేదికపైనే ఆయన తన తొలి పత్రాలపై సంతకాలు చేశారు. విజయ్‌తో పాటు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, సెంగుట్టయ్యన్, అరుణ్‌రాజ్, వెంకటరమణన్, నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు, ఎస్. కీర్తనలు మ‌మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!