ICC Ban PAK Cricketers : పాకిస్తాన్ క్రికెటర్లకు ఐసీసీ ఝలక్
Cమ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
ICC Ban PAK Cricketers : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెటర్లకు. మక్కాలో ఫిక్సింగ్ కలకలం రేపడంతో దానిపై విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించడం, ఎంక్వైరీలో నిజమని తేలడంతో వేటు వేసింది. పక్కా ప్రణాళికతో అడ్డంగా బుక్కయ్యారు పాక్ ఆటగాళ్లు. నిషేధానికి గురైన ప్లేయర్లలో పాకిస్తాన్ కు చెందిన సల్మాన్ భట్ , మహ్మద్ ఆసిఫ్ , మహ్మద్ అమీర్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ వెంటనే ఐసీసీ విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా 2010లో ఇంగ్లండ్ లోని లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. ముగ్గురూ శిక్షించపడ్డారు. జెంటిల్ మన్ గేమ్ లో తీరని మచ్చగా పేర్కొంది ఐసీసీ. భట్, ఆసిఫ్ , అమీర్ లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ(ICC Ban PAK Cricketers) ప్రకటించింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. 2011లో శిక్షను ఖరారు చేసింది ఐసీసీ. స్పాట్ ఫిక్సింగ్ కేసులో కీలక పాత్ర పోషించారంటూ కోర్టు నిర్దారించింది. ఆ సమయంలో భట్ కెప్టెన్ గా ఉన్నాడు. కీలక పేసర్లుగా ఆసిఫ్, అమీర్ ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగానే నో బాల్స్ వేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత విచారణలో నిజమని తేలింది. భట్ కు 10 ఏళ్లు, ఆసిఫ్, అమీర్ పై ఐదేళ్లు విధించారు. ఆ తర్వాత శిక్ష తగ్గించారు. క్షమాపణలు చెప్పడంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు అమీర్.
Also Read : ఆసిస్ తో భారత్ అమీ తుమీకి రెడీ