ICC Womens T20 World Cup : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ షురూ
12న భారత్..పాకిస్తాన్ మధ్య పోరు
ICC Womens T20 World Cup : అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికా ఈసారి ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూప్ లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో 5 జట్లు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వరల్డ్ కప్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫెవరేట్ గా దిగనుంది.
ఈసారి హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు సత్తా చాటేందుకు సిద్దమైంది. ఎలాగైనా సరే వరల్డ్ కప్ తీసుకు రావాలని పట్టుదలతో ఉంది. మరో వైపు దాయాదులైన భారత్ ,పాకిస్తాన్ జట్లు లీగ్ లో భాగంగా ఫిబ్రవరి 12న ఆదివారం కీలక పోరాటానికి సిద్దమయ్యాయి. అందరి కళ్లు ఈ జట్ల మ్యాచ్ పైనే ఉన్నాయి. గత వరల్డ్ కప్ లో టీమిండియా రన్నరప్ తో సరి పెట్టుకుంది. ఇక అండర్ 19 వరల్డ్ కప్ ను భారత అమ్మాయిలు సాధించారు.
మరో వైపు ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో(ICC Womens T20 World Cup) ఆస్ట్రేలియాతో పాటు ఇండియా, న్యూజిలాండ్ , సఫారీ జట్లు హాట్ ఫెవరేట్ గా ఉన్నాయి.
టీమిండియా బలాబలాల విషయానికి వస్తే.. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, యస్తికా భాటియా లతో పాటు ఆల్ రౌండర్లు స్నేహ్ రాణా, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. టోర్నీలో భారత్ 12న పాకిస్తాన్ , 15న విండీస్ , 18న ఇంగ్లాండ్ , 20న ఐర్లాండ్ తో ఆడుతుంది.
భారత మహిళా జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా ఉన్నారు. స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ , షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, రిచా ఘోష్ , జెమీమా రోడ్రిగ్స్ , హర్లీన్ డియోల్ , దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధా యాదవ్ , రేణుకా సింగ్ ఠాకూర్ , అంజలి సర్వాని , పూజా వస్త్రాకర్ , రాజేశ్వరి , శిఖా పాండే ఆడతారు.
రిజర్వ్ ప్లేయర్లుగా సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్ ఉన్నారు.
Also Read : ఆసిస్ టీమ్ హాట్ ఫెవరేట్