US Visa Process : వీసాల జారీకి వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూలు

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న అమెరికా స‌ర్కార్

US Visa Process : ఓ వైపు ఐటీ కంపెనీలు వ‌రుస‌గా కొలువుల‌కు మంగ‌ళం పాడుతున్నా అమెరికా క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రో వైపు కాల్పుల మోత మోగుతున్నా భార‌తీయులు యుఎస్ పై మోజు ఇంకా పెంచుకుంటూనే ఉన్నారు.

ఇక క‌రోనా క‌ష్ట కాలం నుంచి నేటి దాకా వీసాల జారీ ప్ర‌క్రియ‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతూనే ఉంది. ఈ విష‌యంపై భార‌త‌, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. సిబ్బందిని పెంచ‌డం, అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది అమెరికా స‌ర్కార్. అయినా వీసాల జారీ ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం లేదు.

దీనిపై భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. వీసాల జారీ ప్ర‌క్రియ(US Visa Process) మ‌రింత వేగవంతం చేయాల‌ని కోరారు. యుఎస్ స‌ర్కార్ కు సూచించారు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా చూసుకుంటే భార‌త్, చైనా దేశాల నుంచి అత్య‌ధికంగా అమెరికాకు వ‌ల‌స వెళుతున్నారు. వీరిలో ఎక్కువ‌గా చ‌దువుకునేందుకు జాబ్స్ చేసేందుకు . ల‌క్ష‌ల సంఖ్య‌లో వీసాలు పేరుకు పోయాయి. అనుమ‌తి కోసం పెండింగ్ లో ఉన్నాయి.

ఇందులో భాగంగా వేగంగా క్లియ‌ర్ చేసేందుకు యుఎస్ గ‌వ‌ర్న‌మెంట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రెసిడెన్షియ‌ల్ క‌మిష‌న్ కీల‌క సిఫార‌సులు చేసింది. వీసా అపాయింట్మెంట్ల‌ను కేటాయించేందుకు ఇండియా వెలుప‌ల కూడా యుఎస్ దౌత్య కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.వీలైన చోట వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూలు కూడా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది.

Also Read : పౌలా’ ఓలాల‌ ‘బిల్’ గిల‌గిల‌

Leave A Reply

Your Email Id will not be published!