Anurag Thakur : మాతో ఆడక పోతే మీకే నష్టం – ఠాకూర్
పీసీబీ చైర్మన్ రమీజ్ రజాకు చురకలు
Anurag Thakur : కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను బ్లాక్ మెయిలింగ్ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ బోర్డు చైర్మన్ రమీజ్ రజాకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తమతో ఆడక పోతే నష్టం ఏమీ ఉండదని కానీ ఎక్కువగా నష్ట పోవాల్సి వచ్చేది మాత్రం పాకిస్తానేనని గుర్తు పెట్టు కోవాలన్నాడు.
ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రపంచ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న చరిత్ర తమదన్నారు. పొద్దస్తమానం గిల్లి కజ్జాలు, బెదిరింపులకు దిగితే ఇక్కడ ఎవరూ ఊరుకోరన్నారు. ముందు మాజీ క్రికెటర్ గా, కామెంటేటర్ గా ఎంతో అనుభవం కలిగిన రమీజ్ రజా పరిస్థితులను అర్థం చేసుకోకుండా చిన్న పిల్లాడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
కాస్తంతైనా పరిణితి చెందాలని సూచించాడు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). తాము ప్రపంచంలో ఏ జట్టుతోనైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నామని, తమ దేశం కూడా శాంతికాముక దేశమని గుర్తుంచు కోవాలన్నాడు. కేవలం భద్రతా కారణాల రీత్యా మాత్రమే తమ జట్టు పాకిస్తాన్ లో వచ్చే ఏడాది 2023 లో జరిగే ఆసియా కప్ లో పాల్గొన బోదని స్పష్టం చేశామన్నాడు.
కావాలని మాత్రం కాదని పేర్కొన్నాడు. అదే తటస్థ వేదికలపై ఎక్కడైనా ఆడేందుకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించామన్నాడు ఠాకూర్. ఇదిలా ఉండగా కోట్లాది రూపాయల నష్టం పాకిస్తాన్ జట్టుకు కలుగుతుందని, తప్పనిసరిగా భారత్ లో జరిగే వరల్డ్ కప్ లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశాడు కేంద్ర మంత్రి.
Also Read : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష