IND vs AUS 1St T20 : సాగర తీరంలో భారత్ సెన్సేషన్
తొలి టీ20 మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ
IND vs AUS 1St T20 : విశాఖపట్నం – ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ ఆసిస్ కు బిగ్ షాక్ ఇచ్చింది సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు. 5 టీ20 సీరీస్ లో భాగంగా విశాఖ సాగర తీరంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ తేడాతో ఓటమి పాలైంది.
IND vs AUS 1St T20 Match Updates
ఫైనల్ మ్యాచ్ లో నిరాశ పర్చిన సూర్యా భాయ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. సూర్యా కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 4 సిక్సర్లు 9 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 80 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ సైతం అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 రన్స్ చేసింది. ఆసిస్ బ్యాటర్ ఇంగ్టీష్ దుమ్ము రేపాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొని 11 ఫోర్లు 8 సిక్సర్లతో 110 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులతో రాణించాడు.
అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా చివరి దాకా పోరాడింది విజయం కోసం. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. జైశ్వాల్ 21 రన్స్ చేస్తే రింకూ సింగ్ 22 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
Also Read : Animal Trailer : వంగా యానిమల్ వారెవ్వా